Diabetics : షుగర్ ఉందా? అయితే.. ఈ 4 ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు!

మధుమేహంతో ఇబ్బంది పడుతున్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చక్కెర ఉండే పండ్లు, స్వీట్లు, మద్యపానం, వేయించిన ఫుడ్స్‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుని సూచనలు మేరకు మాత్రమే తినండి.

diabetic
New Update

 

మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల పదార్థాలకు దూరం ఉన్నప్పుడే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవారు ఫుడ్ విషయంలో కంట్రోల్‌గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధుమేహం ఉన్నవారు ఈ కింది పదార్థాలను తినకూడదు. 

షుగర్ అధికంగా ఉండే పండ్లు

పండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కానీ కొన్ని రకాల పండ్లను మధుమేహం ఉన్నవారు తినకూడదు. మామిడి, పైనాపిల్, పుచ్చకాయ, అరటి పండ్లు, ద్రాక్ష, లీచీ పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 

చక్కెర ఉండే పదార్థాలు

చక్కెర ఉండే స్వీట్లు, చాక్లెట్లు, తీపిగా ఉండే పానీయాలు వంటిని మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండాలి. కేవలం బెల్లంతో తయారు చేసిన పదార్థాలను మాత్రమే తినాలి. 

ఆల్కహాల్

డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ సేవించడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మధుమేహం ఉన్నవారు మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

వేయించిన ఫుడ్

వేయించిన ఆహార పదార్థాల్లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఇది జీర్ణమై రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. కాబట్టి వేయించిన ఫుడ్‌ తీసుకోకపోతే బెటర్.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  12 వారాలు ఇలా చేస్తే సంతానలేమి సమస్య ఉండదు!

 

#diabetic-patients
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe