Breakfast: ఉదయం అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైందని వైద్యులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పోషకాహారం తీసుకోవాలని సూచిస్తుంటారు. హడావుడిలో టిఫిన్ చేయడం మానేయడం వల్ల చాలా వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు. చాలామంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా కేవలం టి, బిస్కెట్లు మాత్రమే తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోతుంటారు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. ఇలాంటివారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం తీసుకుంటే శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. అల్పాహారం మానేయడం చాలా హానికరమని వైద్యులు అంటున్నారు.
అల్పాహారం మానేయడం వల్ల అనేక సమస్యలు:
ఉదయం పూట టిఫిన్ తినకపోవడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల కళ్ళు తిరగడం, బలహీనత లాంటివి ఉంటాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుంది. దీనివల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. కడుపుని ఎక్కువసేపు ఆకలితో ఉంచడం వల్ల లోపలి కణాలు దెబ్బతింటాయి. అల్పాహారం మానేయడం వల్ల ఉబకాయం వస్తుంది. అంతే కాకుండా వేగంగా బరువు పెరుగుతారు. అనేక సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ మందగిస్తుంది. అనేక సమస్యలు వస్తాయి.
ఇది కూడా చదవండి: జుట్టు నల్లబడటానికి ఆయుర్వేద మార్గాలివే
శరీరంలో శక్తి తగ్గటం, బలహీనత ఉంటుంది. దీని కారణంగా బరువు కూడా బాగా పెరుగుతారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మైగ్రేన్ సమస్యలు, విపరీతమైన తలనొప్పి, వికారం, వాంతులు లాంటివి ఉంటాయి. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఎంతోకొంత ఉదయం అల్పాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ అలవాట్లతో కడుపులో క్యాన్సర్ ఖాయం