బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా.. అయితే ఆరోగ్యంగా ప్రమాదంలో పడినట్లే!

ఉదయం పూట అల్పాహారంగా సోయా ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, పాల ఉత్పత్తులు, టీతో బిస్కెట్లు వంటివి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉదయం పూట తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందట. వీటికి బదులు బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది.

milkandmedicin10
New Update

సాధారణంగా అందరూ ఉదయం పూట టిఫిన్స్ తింటారు. కొందరు డైట్ పాటించేవాళ్లు టిఫిన్‌కి బదులు కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటారు. అయితే చాలామందకి తెలియక ఉదయం టిఫిన్ విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. వీటివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. అయితే ఉదయం పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడదని ఆ ఆహార పదార్థాలేంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. 

ఇది కూడా చూడండి: Infosys: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

సోయా ఉత్పత్తులు

ఉదయం పూట పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. టిఫిన్‌గా పాల ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులో మంట ఏర్పడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. వీటిని తీసుకుంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందట.

ఇది కూడా చూడండి: Sajjala ramakrishna reddy: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

వైట్ బ్రెట్

ఉదయం పూట వైట్ బ్రెడ్ తీసుకోవడం అంత మంచిది కాదు. దీనికి బదులు మల్టీ గ్రెయిన్ బ్రడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. వైట్ బ్రెడ్ తినడం వల్ల బాడీలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైట్ బ్రెడ్‌ను ఉదయం పూట తీసుకోవద్దు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

టీలో బిస్కెట్లు

లేచిన వెంటనే టీ లేకపోతే కొందరికి రోజు కూడా స్టార్ట్ కాదు. ఇలా టీతో బిస్కెట్లు తిని ఇదే టిఫిన్ అని సరిపెట్టుకుంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#breakfast-bread
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe