Salt : నెల రోజులు ఉప్పు తినడం మానేస్తే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా? వంటల్లో తప్పకుండా ఉపయోగించే ఉప్పును ఒక నెల రోజులు తినకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోతే అకస్మాత్తుగా బరువు తగ్గడం, జీర్ణక్రియ, మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 27 Sep 2024 | నవీకరించబడింది పై 27 Sep 2024 21:17 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం అందరూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలు రావడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం. అయితే కొందరు తక్కువగా ఉప్పు తింటే మరికొందరు ఎక్కువగా తింటారు. ఉప్పు అనేది లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్న, పూర్తిగా తీసుకోకపోయిన ప్రమాదమే. ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఉప్పు తినడం మానేస్తే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి నెల రోజులు ఉప్పు తీసుకోకపోతే శరీరంలో కలిగే మార్పులేంటో చూద్దాం. బరువు తగ్గడంవంటలు రుచిగా రావాలంటే ఉప్పు తప్పనిసరి. ఒక నెల రోజుల పాటు ఉప్పు తీసుకోకపోవడం వల్ల ఒక్కసారిగా బరువు తగ్గుతారు. పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. కాకపోతే ఒక్కసారిగా బరువు తగ్గడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణక్రియలో సమస్యలుఉప్పు తినకపోతే శరీరంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల జీర్ణక్రియలో సక్రమంగా పనిచేయదు. ప్రేగులను ప్రభావితం చేయడం, కడుపు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి కొంచెం అయిన ఉప్పు తినడం అలవాటు చేసుకోవాలి. జీర్ణక్రియలో సమస్యలుశారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. ఉప్పు తినకపోవడం వల్ల మానసికంగా ఇబ్బంది పడతారు. దీంతో ఒత్తిడి పెరిగి బీపీ తగ్గుతుంది. ఒక్కసారిగా బీపీ తగ్గితే అనారోగ్య బారిన పడతారు. కాబట్టి ఉప్పు తినడం అసలు మానవద్దు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : ఈ డైట్ ప్లాన్‌తో 14 రోజుల్లో 6 కిలోలు తగ్గండి! #weight-loss #health-issues #eating-salt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి