Potato: ఈ సమస్యలు ఉంటే బంగాళాదుంప అస్సలు ముట్టుకోవద్దు బంగాళాదుంపలను సరైన పరిమాణంలో తీసుకుంటే అనేక వ్యాధులను నివారించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బంగాళాదుంపలు తక్కువగా తినాలి. చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Potato షేర్ చేయండి Potato: బంగాళాదుంపలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియంతో సహా అనేక విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా బంగాళాదుంపలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అన్ని రకాల కూరగాయలతో కలిపి బంగాళాదుంపను వండుకోవచ్చు. బంగాళా దుంపలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన వంటకం. ఇతర కూరగాయలతో పోలిస్తే బంగాళా దుంపలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బంగాళాదుంపలను సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు. బంగాళాదుంపలు తింటే కలిగే ప్రయోజనాలు: బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. శారీరక శ్రమకు శక్తి అవసరమైన వారికి బంగాళాదుంపలు బాగా ఉపయోగపడతాయి. బంగాళాదుంపలో ఉంటే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బంగాళాదుంపలు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బంగాళాదుంపలు మోకాళ్ల నొప్పులను దూరం చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో కూడా బంగాళాదుంపలు సహాయపడతాయి. ఇది కూడా చదవండి: నెల రోజులు ఖాళీ కడుపుతో ఈ పండు తినండి.. ఆ వ్యాధులు పరార్! ఈ వ్యాధులు ఉంటే బంగాళాదుంపలు తినవద్దు: బంగాళాదుంపలను కొందరు జాగ్రత్తగా తినాలి. బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు బంగాళాదుంపలను తక్కువగా తినాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బంగాళాదుంపలు తక్కువగా తినాలి. చిప్స్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్, అదనపు కేలరీలు ఉంటాయి. కాబట్టి బంగాళాదుంపలు తక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: రాత్రి ఈ దుస్తులు వేసుకోండి.. ఆరోగ్యానికి మంచిది! #health-effects-of-eating-more-potatoes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి