మార్నింగ్ వాకింగ్‌కి వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

రోజూ ఉదయం వాకింగ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా మలవిసర్జన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు వాటర్ తాగడం, స్ట్రెచింగ్ వ్యాయామాలు వంటి నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Morning walking
New Update

మార్నింగ్ వాక్ చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నడవడం వల్ల ఫిట్‌గా ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అయితే వాకింగ్ చేసేవాళ్లు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్లు అయితే కొన్ని నియమాలు పాటిస్తూ చేయాలి. మార్నింగ్ వాకింగ్‌లో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే?

అసలు స్కిప్ చేయవద్దు..

మార్నింగ్ వాక్‌కి వెళ్లే వారు తప్పకుండా  మలవిసర్జన చేసి వెళ్లాలి. లేదంటే మలం పేరుకుపోయి మలబద్ధకానికి దారితీస్తుంది. దీని వల్ల పేగు కదలికలో సమస్యలు వస్తాయి. కొందరు  మలవిసర్జన రావట్లేని లేదా ఆలస్యం అవుతుందని స్కిప్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం

మార్నింగ్ వాక్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా కాస్త నీళ్లు తాగాలి. ఎందుకంటే నీరు తాగడం వల్ల  బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో కండరాలు బలంగా మారి.. మీరు వాకింగ్ చేయడానికి ఎనర్జీ వస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కూడా సాయపడుతుంది. అయితే వాకింగ్‌కి వెళ్లే ముందు చల్లని నీరు కంటే గోరువెచ్చని నీరు తాగడం మంచిది. 

ఇది కూడా చూడండి: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

డైరెక్ట్‌గా వాకింగ్ చేయకుండా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. దీంతో తొందరగా నడవగలుగుతారు. కాబట్టి వాటర్ తాగి, స్ట్రెచింగ్ వ్యాయమాలు చేసి వాకింగ్ చేయండి. ఖాళీ కడుపుతో అయిన అసలు వాకింగ్ చేయవద్దు.

ఇది కూడా చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

#morning-walk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe