ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే?

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఐదేళ్ల నుంచి నడుపుతున్న నకిలీ కోర్టును పోలీసులు గుర్తించారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ క్లయింట్‌లకు అనుకూలంగా తీర్పునిస్తూ డబ్బులు దోచుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

New Update
fake court

ఈ మధ్య కాలంలో నకిలీ బ్యాంకుల గురించి ఎక్కువగా వింటున్నారు. అయితే ఇటీవల నకిలీ కోర్టును కూడా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో ఐదేళ్ల నుంచి ఓ నకిలీ కోర్టు ఉంది. కానీ పోలీసులు ఇటీవల దానిని గుర్తించారు. ఐదేళ్ల నుంచి ఈ కోర్టులో తీర్పులు ఇస్తున్నారు. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి న్యాయమూర్తిగా వ్యవహరించి తీర్పులు ఇస్తున్నారు.

ఇది కూడా చూడండి: Big Breaking: ఏపీలో టీడీపీ నేత దారుణ హత్య

కోర్టు కార్యకలాపాలపై అనుమానం వచ్చి..

ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా అచ్చం కోర్టు ఎలా ఉంటుందో.. అలానే మెయింటైన్ చేశారు. ఈ కోర్టు కార్యకలాపాలపై అనుమానం వచ్చి అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టు కరంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. న్యాయమూర్తి అయిన శామ్యూల్‌ ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో తన క్లయింట్‌కు 2019లో అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చాడు. 

ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం

ఆ తర్వాత భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్‌ పేరును చేర్చాలని జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశాడు. దీనిని అమలుచేయాలని కోరుతూ శామ్యూల్‌ మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్‌కోర్టులో అప్పీల్‌ చేశాడు. తాను జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను కూడా ఈ పిటిషనుకు జత చేశాడు. ఆ ఉత్తర్వులు నకిలీవని కోర్టు రిజిస్ట్రారు గుర్తించడంతో శామ్యూల్‌ నకిలీ కోర్టును నడుపుతున్నట్లు బయటపడింది.

 ఇది కూడా చూడండి:ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం

ఈ నకిలీ కోర్టును గత ఐదేళ్ల నుంచి నడిపిస్తున్నారు. సిటీ సివిల్ కోర్టులో ఉన్న భూవివాదాల కేసుల ద్వారా విషయం బయటపడింది. క్లయింట్లను పిలిచి.. వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ డబ్బులు దోచుకున్నాడు. గత ఐదేళ్ల నుంచి ఇదే జరుగుతుంది. కానీ పోలీసులు ఇటీవల నకిలీ కోర్టును గుర్తించారు. 

ఇది కూడా చూడండి: Telangana: రాష్ట్రవ్యాప్తంగా 162 మంది ఏఈవోల సస్పెన్షన్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

UP బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో BJP లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.

New Update
Gonda District President

Gonda District President

రెండు రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత మహిళతో నడిరోడ్డుపై శృంగారం చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. తాజాగా మరో బీజేపీ లీడర్ రాసలీలల వీడియో లీక్ అయ్యింది. మహిళా కార్యకర్తను రాత్రి పార్టీ ఆఫీస్‌లోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లే ముందు ఆ మహిళను అతను కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్‌ 12న రాత్రి 9.30 గంటలకు గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్, ఒక మహిళా కార్యకర్తని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చాడు.  ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని ఆ తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. దీంతో గోండా జిల్లా బీజీపీ అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్‌ మహిళా కార్యకర్తతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియోపై బీజేపీ నేత బామ్ బామ్‌ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని ఒప్పుకున్నారు. ఆ రోజు మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైందని చెప్పారు. దీంతో పార్టీ కార్యాలయంలో విశ్రాంతి తీసుకోవాలని చెప్పానని అన్నారు. మానవతా దృక్పథంతో ఆ మహిళకు సహాయం చేసినట్లు బామ్‌ బామ్‌ తెలిపారు. అయితే తనపై కుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగడం ఇష్టం లేని కొందరు ఇలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ఈ వీడియో వైరల్‌ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.

BJP Leader video | Viral Video | uttarapradesh | BJP district president | Amar Kishore Bam Bam | latest-telugu-news | viral-news

Advertisment
Advertisment
Advertisment