AP News: ఏపీలో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని ఏం చేశాడంటే..

కాకినాడ జిల్లా తొండంగి మండలం జి.ముసలయ్యపేటలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు కొడుకు అర్జున్. తలకి బలంగా దెబ్బ తగలడంతో యాదాల తాతీలు (68) అక్కడికక్కడే మరణించాడు. పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు పెట్టారు.

New Update
Kakinada district

Kakinada

AP News: ఆస్తి కోసం కన్న తండ్రిని కసాయి కొడుకు ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం కాకినాడ జిల్లా తునిలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక కథనం ప్రకారం.. తొండంగి మండలం జి.ముసలయ్యపేటలో యాదాల తాతీలు (68) నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. నిన్న ఆస్తి కోసం అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. కొడుకులిద్దరికీ సర్ది చెప్పే యత్నం తండ్రి చేశాడు.

ఆస్తి తగాదాల వల్లే..

దీంతో తండ్రిపై కోపం పెంచుకున్నాడు అర్జున్. తండ్రి నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఇనుప రాడ్డుతో కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కొడుకు అర్జున్. తలకి బలంగా తగలడంతో తండ్రి యాదాల తాతీలు (68) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాల వల్లే హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తీర్థం అనుకుని తాగారు.. విషయం తెలిసి షాక్‌

ఇది కూడా చదవండి: భోజనంతో పాటు పచ్చిమిర్చి తింటే ప్రయోజనమా?

Advertisment
తాజా కథనాలు