Chicken: చికెన్ తినేవారికి క్యాన్సర్..! తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు

తాజా పరిశోధనలో చికెన్ తినడం వల్ల ఉదర సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది. చికెన్ తినడం నేరుగా క్యాన్సర్‌కు కారణం కాకపోయినా.. వంట విధానాలు, ప్రాసెసింగ్ పద్ధతులు, కోళ్లను పెంచడానికి ఉపయోగించే హార్మోన్లు, యాంటీ బయోటిక్స్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచవచ్చు.

New Update
chicken and cancer

chicken and cancer

Chicken and Cancer: కొంతమందికి నాన్ వెజ్ లేకుండా ముద్దు దిగడం కష్టం అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ అంటే మహా ఇష్టపడతారు. వారానికి 6 రోజులూ చికెన్ తోనే గడిపేస్తుంటారు.  చికెన్ కర్రీ, చికెన్ లాలీపాప్, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ ఇలా చికెన్ తో రకరకాల వంటకాలు చేసుకొని తింటారు. ఇలాంటి చికెన్ ప్రియులకు ఇప్పుడు ఓ షాకింగ్ వచ్చింది. 

చికెన్ తో క్యాన్సర్ రిస్క్ 

 తాజా పరిశోధనలో చికెన్ తినడం వల్ల  క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు తేలింది. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే  ఉదర సంబంధిత తలెత్తే అవకాశం ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.  ఇటలీలో 48- 69 మధ్య వయసు ఉన్నవారిపై ఈ అధ్యయనం నిర్వహించగా.. పురుషుల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేలింది. పరిమిత మోతాదులో తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. 

chicken
chicken

అయితే  చికెన్ తినడం నేరుగా క్యాన్సర్‌కు కాకపోయినా..  వంట విధానాలు, ప్రాసెసింగ్ పద్ధతులు, కోళ్లను పెంచడానికి ఉపయోగించే హార్మోన్లు, యాంటీ బయోటిక్స్  క్యాన్సర్ రిస్క్‌ను పెంచవచ్చు.  కొన్ని అధ్యయనాలు చికెన్ తినడం ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచే అవకాశం ఉందని సూచించాయి. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. యాంటీబయోటిక్స్, హార్మోన్లు లేకుండా పెంచిన కోడి చికెన్ తినడం   ఆరోగ్యకరమైన  ఎంపికగా ఉంటుంది.

వంట విధానాలతో  క్యాన్సర్ రిస్క్ 

వంట విధానాల కారణంగా కూడా క్యాన్సర్ రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   చికెన్‌ను గ్రిల్ చేయడం, ఫ్రై చేయడం వంటి హై-హీట్ వంట విధానాలు హెటెరోసైక్లిక్ అమిన్స్ (HCAs),  పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) వంటి కార్సినోజెనిక్ కాంపౌండ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.  అలాగే చికెన్ నగ్గెట్స్, సాస్, డెలీ మీట్స్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్  అధిక సాల్ట్, ప్రిజర్వేటివ్స్,  అదనపు రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి  కొలన్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. 

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

latest-news | telugu-news

Advertisment
తాజా కథనాలు