చాలామందికి డైలీ చూయింగ్ గమ్ తినే అలవాటు ఉంటుంది. కొందరు టైమ్ పాస్‌కి అదే పనిగా చూయింగ్ గమ్ నములుతుంటారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు ఉంటారు. స్కూల్ లేదా కాలేజీకి వెళ్లినప్పుడు టైమ్ పాస్ కోసం నములుతారు. మరికొందరు మద్యం సేవిస్తే బయటకు వాసన రాకుండా ఉండటానికి చూయింగ్ గమ్ నమలుతారు. అయితే కొన్నిసార్లు చూయింగ్ గమ్ నమలడం మంచిదైనప్పటికీ అదే పనిగా నమలడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల జరిగే మంచి కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఎక్కువగా చూయింగ్ గమ్ నమలడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్
దవడ ఎముకలు అరిగిపోయే..
చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది. అయితే నిరంతరంగా చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల దవడ దగ్గర ఉండే ఎముకలు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఇలా నమిలితే టెంపోరోమాండిబ్యులర్ జాయింట్‌పై ఒత్తిడి పడుతుంది. దీంతో దవడ నొప్పి రావడంతో పాటు తలనొప్పి, చెవి నొప్పి కూడా వస్తుంది.
ఇది కూడా చూడండి: ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?
చూయింగ్ గమ్‌లను అనేక రసాయనాలతో కలిపి చేస్తారు. ఇందులో ఎక్కువగా ఆమ్లం ఉంటుంది. అధికంగా నమలడం వల్ల ఈ ఆమ్ల దంతాలకు హాని కలిగిస్తుంది. ఇందులో షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల కొంత వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు.
ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు
ఒకవేళ షుగర్ లెస్ చూయింగ్ గమ్‌లను తినాలని అనుకుంటే భోజనం తర్వాత తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే భోజనం తర్వాత నమిలితే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. దీంతో దంతాలు శుభ్రం అవుతాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Jammu: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి