/rtv/media/media_files/2026/02/25/free-hpv-vaccine-2026-02-25-06-39-59.jpg)
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వేగంగా వ్యాపిస్తున్న గర్భాశయ క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు, దేశవ్యాప్తంగా యుక్త వయసు బాలికలందరికీ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించింది. రెండేళ్ల క్రితం బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుండి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పట్టాలెక్కించనుంది.
BREAKING || India's Fight Against Cervical Cancer
— TIMES NOW (@TimesNow) February 24, 2026
Health Ministry sources to Times Now
- 'Nationwide HPV Vaccine drive soon'
- 'Govt rollout to prevent cervical cancer'
- 'Free vaccination for adolescent girls'
Under the government’s ‘Swastha Nari’ program
వ్యాక్సినేషన్ లక్ష్యాలు
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 14 ఏళ్లు దాటిన బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందజేస్తారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 2.6 కోట్ల డోస్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ వ్యాక్సిన్ కూటమి 'గావి' నుండి కోటి డోసుల సైప్లై తీసుకోనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మెర్క్ కంపెనీకి చెందిన 'గర్డాసిల్' టీకాను బాలికలకు వేయనున్నారు. ఇది నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్లను సమర్థవంతంగా నిరోధిస్తుంది. కేవలం ఒక డోసుతోనే వైరస్ నుండి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మార్కెట్లో ఈ టీకా ఒక్కో డోసు ధర రూ.3,927 వరకు ఉంది. అయితే ప్రభుత్వ చొరవతో ఇది ఉచితంగా అందనుంది.
వయస్సును బట్టి టీకా తీసుకోవాల్సిన డోసులు మారుతుంది. 15 ఏళ్ల లోపు బాలికలు రెండు డోసులు, 15 ఏళ్లు దాటిన వారు మూడు డోసులు తీసుకోవాలి. మహిళల భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులందరూ తమ కుమార్తెలకు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ ఇప్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ రహిత భారత్ దిశగా ఇదొక చారిత్రాత్మక అడుగు అని చెప్పవచ్చు.
Follow Us