Birthday: సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి..?

హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. పుట్టినరోజు నాడు సనాతన ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి హారతి ఇస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Birthday

Birthday

New Update

Birthday: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పుట్టినరోజు జరుపుకోవడానికి కేక్ కట్ చేయడం, క్యాండిల్స్ వెలిగించి ఆర్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం తప్పని పెద్దలు అంటున్నారు ప్రతి ఒక్కరూ మతం, నాగరికత, సంస్కృతి గురించి గర్వపడుతూ ఉంటాం. కానీ ప్రజలు విచక్షణ రహితంగా ఇంగ్లీష్ కల్చర్‌కు అలవాటు పడ్డారు. కేకులు కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం, కొవ్వొత్తులను ఆర్పడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. హిందూమతంలో, వేదాల్లో కేక్ కట్ చేయడం అనేది ప్రస్తావనే లేదు. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తిని ఆర్పి తర్వాత కేక్ కట్ చేయడం ఆశుభం. అంటే పుట్టినరోజు జరుపుకోకూడదని అర్థం కాదు. అసలు పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, సనాతన ధర్మం ఏం చెబుతుంది. ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

శాస్త్రంలో కొవ్వొత్తి ఊదడం అనేది అశుభం:

కానీ మన సనాతన ధర్మంలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దాని ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రంలో కొవ్వొత్తి ఊదడం అనేది చాలా అశుభం. ఇలా చేయడం వల్ల జీవితంలో దురదృష్టం అని పెద్దలు చెబుతున్నారు. ఇది ఆరోగ్యం, అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హిందూమతంలో అగ్ని, కాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లోని పిల్లలను కూడా దీపాలుగా భావిస్తుంటారు. ఎల్లప్పుడు దీపాల్లా దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ప్రార్థిస్తారు. హిందూమతంలో దీపాలను ఆర్పి వేయడానికి బదులు దాన్ని పక్కకు తీయడం అనే సాంప్రదాయం ఉంది. అందుకే కొవ్వొత్తులను ఆర్పేసి కేక్ కట్ చేయడం సనాతనధర్మం కాదు. 
 
ఇది కూడా చదవండి: ఈ అలవాట్లతో కడుపులో క్యాన్సర్‌ ఖాయం

పుట్టినరోజు నాడు సనాతన ధర్మం ప్రకారం ఆ వ్యక్తికి హారతి ఇస్తే చాలా మంచిది. ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి. అలాగే అగ్నిదేవుని ఆశీర్వాదం లభిస్తుంది. పుట్టినరోజు పెద్దల పాదాలకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటే ఎంతో శుభప్రదం. అలాగే గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకోవాలి. మాంసాహారం వండకూడదు, తినకూడదు ప్రస్తుత కాలంలో బర్త్‌ డేలకు రిటన్ గిఫ్ట్ ట్రెండ్ బాగా పెరిగింది. మీ పుట్టిన రోజున చిన్న పిల్లలకు కొన్ని బహుమతులు ఇవ్వాలి. అలాగే పేదలకు దానం చేయాలి. తులా దానం చేయడం ఎంతో శ్రేయస్కరమని పురాణాలు చెబుతున్నాయి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

#birthday
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe