Cancer: మానవ వ్యర్థాలతో క్యాన్సర్‌ ఔషధం.. శాస్త్రవేత్తల అద్భుతం!

కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఓ మలుపు చోటుచేసుకుంది. మానవ వ్యర్థాల నుంచి తయారుచేసిన స్పెషల్ మెడిసిన్‌తో ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్ బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

New Update
Cancer

కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక అద్భుతమైన మలుపు చోటుచేసుకుంది. మానవ వ్యర్థాల (మలం) నుంచి తయారుచేసిన స్పెషల్ మెడిసిన్‌తో ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్ బాధితులు నెమ్మదిగా కోలుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని శాస్త్రీయంగా ‘ఫెకాల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్’ (FMT) అని పిలుస్తారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి సేకరించిన వ్యర్థాలను లెటెస్ట్ టెక్నాలజీతో ఫ్రీజ్ చేసి, ఎండబెట్టి ఈ కాప్సూల్స్‌ను తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వల్ల రోగి శరీరంలోని జీర్ణవ్యవస్థలో 'మంచి సూక్ష్మజీవులు' (గుడ్ బ్యాక్టీరియా) పెరిగి, రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయి.

చికిత్సలో అద్భుత ఫలితాలు
కెనడాలోని 'లాసన్ హెల్త్ రీసెర్చ్ ఇన్సిట్యూట్' శాస్త్రవేత్తలు నిర్వహించిన రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సాధారణ ఇమ్యునోథెరపీ మందుల కంటే ఈ FMT పిల్స్ 40-45 శాతం ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. సాధారణ ఔషధాలతో కలిపి వీటిని వాడినప్పుడు ఏకంగా 80 శాతం మేర మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ పిల్స్‌ను సాధారణ చికిత్సతో కలిపి వాడటం వల్ల 79 శాతం మంది రోగులలో క్యాన్సర్ కణాలు తగ్గడం లేదా నియంత్రణలోకి రావడం గమనించారు. ఈ ఔషధాలు నేరుగా క్యాన్సర్‌ను నయం చేయవు, కానీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్ మందులు మరింత శక్తివంతంగా పనిచేసేలా చేస్తాయి. ఈ పరిశోధన భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు