Brush: దంతాల శుభ్రత కోసం రోజుకు కనీసం రెండుసార్లు బ్రష్ చేయడం అవసరం. చాలా సార్లు ప్రజలు హడావిడిగా బ్రష్ చేసుకుంటారు. ఇది నోటి ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్నిసార్లు ఉదయాన్నే పళ్లు తోముకోవడం మర్చిపోతారు. దీనివల్ల రోజంతా వికారంగా అనిపిస్తుంది. దీని కారణంగా నోటి ఆరోగ్యం క్షీణించవచ్చు. దంతాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే సరిగ్గా బ్రష్ చేస్తారని ఒక అధ్యయనం చెబుతోంది. సరిగ్గా బ్రష్ చేసుకోని వారికి డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉంది. దంతక్షయం కారణంగా ఈ వ్యాధి వస్తుంది. మెదడులో వాపు, దంతాలలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. దంతాలు పాడవుకుండా కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా బ్రష్ చేయాలి. అయితే అతిగా బ్రష్ చేయడం వల్ల దంతాలకు హాని కలుగుతుందా అనే సందేహం వస్తుంటుంది.
అతిగా బ్రష్ చేస్తే ఏమౌతుంది..?
- చాలామంది పళ్లను శుభ్రం చేసుకోవడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. కొందరికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం అలవాటుగా ఉంటుంది. చాలా సార్లు చాలా వేగంగా బ్రష్ చేస్తే అది ఎనామెల్ పైపొరను బలహీనపరుస్తుంది. దీని కారణంగా దంతాల మూలాలు కనిపిస్తాయి. అంతేకాకుండా అనేక నష్టాలు ఉంటాయి. బ్రిస్టల్స్ అరిగిపోయిన తర్వాత కూడా బ్రష్‌లను మార్చకపోతే అనేక రకాల నోటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
బ్రష్ చేసేటప్పుడు 5 తప్పులు చేయవద్దు:
- అదే బ్రష్‌ను 3-4 నెలల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. ఒక బ్రష్‌ను 200 సార్లు మాత్రమే ఉపయోగించాలి. లేకుంటే దంతాలు సరిగా శుభ్రం కావు, బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
- చాలా త్వరగా బ్రష్ చేయడం వల్ల నోరు సరిగా శుభ్రం కాదు. కనీసం 45 సెకన్ల నుంచి 2 నిమిషాల వరకు బ్రషింగ్ చేయాలి.
- బాత్రూంలో బ్రష్ ఉంచడం వల్ల బ్యాక్టీరియా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- పళ్లను శుభ్రం చేసుకోవడంతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోకుంటే బ్యాక్టీరియా సమస్యలు ఉండవు.
- డెంటల్ ఫ్లాస్ ఉపయోగించడం వల్ల దంతాలు బలహీనపడతాయి, దెబ్బతింటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ పువ్వుతో అనేక రోగాలు మాయం.. తప్పక తెలుసుకోండి!