Butterfly Pea Flower: ఈ పువ్వుతో అనేక రోగాలు మాయం.. తప్పక తెలుసుకోండి!

ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధం. శంఖుపూల మొక్క వేరు రసం నోట్లో వేసుకుంటే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రాతి ఉప్పు, ఆవాల నూనెతో మెత్తగా శంఖు ఆకుల పేస్ట్‌ కలిపి రాసుకుంటే దద్దుర్లు పోతాయని చెబుతున్నారు.

New Update
Butterfly Pea flower

Butterfly Pea flower: ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది వివిధ వ్యాధుల చికిత్సలో వాడుతారు. నీలిరంగు శంఖు పుష్పాన్ని పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో గుణాలున్న ఈ పువ్వు చూడ్డానికి కూడా అంతే అందంగా ఉంటుంది. ఆయుర్వేదంలో శంఖం పువ్వు ఒక ముఖ్యమైన ఔషధం. ఈ పువ్వు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఈ మొక్కలోని ఔషధ గుణాలు కూడా చాలా ప్రయోజనకరం. ఆయుర్వేదంలో శంఖు పూల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మూలాలు, ఆకులు, గింజలతో పాటు అనేక ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. శంఖు పూల మొక్క వేరు రసం తీసి 5 నుంచి 6 చుక్కలు నోట్లో వేసుకుంటే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుందని డాక్టర్లు అంటున్నారు. 

శంఖం ఆకుల రసంతో ప్రయోజనాలు:

దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు రాతి ఉప్పు, ఆవాల నూనెతో మెత్తగా శంఖు ఆకుల పేస్ట్‌ కలిపి రాసుకుంటే దద్దుర్లు పోతాయని చెబుతున్నారు. చక్కటి ఉపశమనం ఉంటుందంటున్నారు. శంఖు పూల మొక్క వేరుతో పాటు ఆకులను గ్రైండ్ చేసి క్రమం తప్పకుండా వాడితే చర్య సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అరచేతులు, పాదాలపై చర్మ సమస్యలకు శంఖం ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. 7 చుక్కల అల్లం రసంలో 2 చెంచాల శంఖం ఆకుల రసం కలిపి తాగితే మంచిది. 2 గ్రాముల శంఖు పూల గింజల పొడి, 2 చిటికెల రాతి ఉప్పు, 2 చిటికెల ఎండు అల్లం నీటిలో కలిపి రాత్రిపూట తాగితే కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  జగన్‌ను తిరుమలకు వెళ్లకుండా ఎవరు ఆపారు: చంద్రబాబు

Advertisment
Advertisment
తాజా కథనాలు