/rtv/media/media_files/2025/05/03/sJivScMeWdZIOAzZm6kA.jpg)
Banana Peel
సీజన్‌తో సంబంధం లేకుండా అరటి పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. వీటిలో పోషకాలు, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు వంటి వాటిని తగ్గిస్తాయి. అయితే ఈ అరటి పండ్లతో ఎన్నో రకాల పదార్థాలు కూడా చేయవచ్చు. నిజానికి అరటి పండును తినేసి తొక్కను డస్ట్ బిన్‌లో పడేస్తారు. కేవలం అరటి పండుతోనే కాదు.. తొక్కతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకోసారి వీటిని డస్ట్‌బిన్‌లో పడేయరని నిపుణులుఅంటున్నారు. అయితే ఈ అరటి పండు తొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
చర్మ ఆరోగ్యం
అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేయకుండా ముఖానికి మర్దన చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ అరటి పండు తిన్న తర్వాత ముఖానికి తొక్కను అప్లై చేయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గిపోతాయి. చర్మం కూడా మృదువుగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు అంటున్నారు.
సోరియాసిస్
అరటి పండు తొక్కల వల్ల సోరియాసిస్ సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కలను అప్లై చేయడం వల్ల దురద తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల గాయాలు త్వరగా మానేలా చేస్తాయి. అరటి పండు తొక్కను జుట్టు కుదుళ్లకు అప్లై చేసి కొంత సమయం తర్వాత తలస్నానం చేసినా సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. జుట్టు పగుళ్లు అన్ని కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే దంతాలకు తొక్కలు రాయడం వల్ల తెల్లగా మారుతాయని నిపుణులు అంటున్నారు.
తలనొప్పి సమస్యలు
మెడ నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఈ అరటి తొక్కతో తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఈ తొక్కతో లెదర్ షూస్, వెండి వస్తువులను కూడా శుభ్రం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. సో తొక్కే కదా అని ఈజీగా తీసిపారేయవద్దని నిపుణులు అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.