/rtv/media/media_files/2025/08/17/dhoop-sticks-2025-08-17-20-22-28.jpg)
dhoop sticks
భక్తి కోసం, ఇంట్లో సువాసనల కోసం కొందరు ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో చాలా మంది ఇంట్లో తప్పకుండా ఇవి ఉంటాయి. కొందరు తక్కువగా వీటిని వెలిగిస్తే మరికొందరు వీటిని ఎక్కువగా వెలిగిస్తుంటారు. ఎందుకంటే వీటి నుంచి సువాసన ఎక్కువగా వస్తుంది. దీంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని భావిస్తారు. అయితే ఈ అగరబత్తీలు సిగరెట్ పొగ కంటే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి నుంచి వెలువడే పొగలో సూక్ష్మ కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాసకోశ సమస్యలను తెచ్చి పెడతాయి. దీంతో ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అగరబత్తీ ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో కలిసినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో తలనొప్పి, వికారం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతుున్నారు.
ఇది కూడా చూడండి: High BP And Kidney: అధిక రక్తపోటు, కిడ్నీ రోగులకు శుభవార్త.. పండ్లు, కూరగాయలతో మెరుగైన ఆరోగ్యం
వీటిలోని రసాయనాలు..
అగరబత్తీల నుంచి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, అసిటాల్డిహైడ్ వంటి వాయువులు కూడా విడుదల అవుతాయి. వీటి వల్ల శ్వాసకోశ సమస్యలను, ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఎక్కువగా పీల్చడం వల్ల ఆస్తమా, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు ఇంటి తలుపులు అన్ని వేసి మరి అగరబత్తీలు వెలిగిస్తారు. ఇలా కాకుండా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచి వీటిని వెలిగించాలి. దీనివల్ల గాలి వస్తుంది. దీంతో ఈ కృత్రిమ సువాసనలు అంతా బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల కాస్త ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా పీల్చడం వల్ల..
పూర్వం రోజుల్లో ఎక్కువగా ధూపం వాడేవారు. ప్రస్తుతం రోజుల్లో అయితే ఎక్కువగా ఇలాంటి రసాయనాలు ఉండే వాటిని వాడుతున్నారు. దీనివల్ల ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సులోనే చాలా మంది క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతున్నారు. మారిన జీవనశైలితో పాటు ఇలాంటి రసాయనాలు ఉండేవి వాడటం కూడా ఓ కారణమే. ఇలాంటి కృత్రియ రసాయనాలు ఉండే వాటిని కాకుండా సహజంగా ఇంట్లో తయారు చేసిన అగరబత్తీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాడిపోయిన పువ్వులతో వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వాటితో తయారు చేసిన వాటిని వాడటం వల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Kids Health: తల్లిదండ్రులు పిల్లలను ఇప్పుడే కంట్రోల్ పెట్టండి.. లేకపోతే 2050 కల్లా ఈ వ్యాధి రావడం పక్కా!