/rtv/media/media_files/2025/02/22/EjmqVcyCmRieRiRvVhdm.jpg)
Actress Poonam Pandey Viral Video
Viral Video: నటి పూనమ్ పాండే సోషల్ మీడియాలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు ఆమె మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఒక అభిమాని పూనమ్ పాండేను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పూనమ్ పాండే వీడియోపై కొంతమంది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పూనమ్ పాండేను ట్రోల్ చేస్తున్నారు.
పూనమ్ పాండేను ముద్దు పెట్టుకోవడానికి..
ఇదంతా కావాలని చేసిన వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వైరల్ భయానీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. వీడియోలో పూనమ్ పాండే ఎరుపు రంగు దుస్తులు ధరించి నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. అక్కడికి వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. సడెన్‌గా ఆ వ్యక్తిని చూసి పూనమ్ కొంచెం షాక్ అవుతుంది. ఆ తర్వాత యువకుడు తన ఫోన్ తీసి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభిస్తాడు. సెల్ఫీ తీసుకుంటూ ఒక్కసారిగా పూనమ్ పాండేను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. పూనమ్ పాండే వెంటనే వెనక్కి వెళ్లింది.. ఇంతలో మరో వ్యక్తి వచ్చి అభిమానిని నెట్టివేయడం వీడియోలో చూడవచ్చు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నిమ్మకాయ నీరు తాగితే?
ఈ వీడియోపై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. పబ్లిసిటీ కోసం పూనమ్ పాండే ఏమైనా చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు చనిపోయానని ప్రచారం చేసుకుంది. ఇప్పుడు మరో స్క్రిప్ట్‌తో ముందుకొచ్చిందని అంటున్నారు నెటిజన్లు. గత సంవత్సరం పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి మరణ వార్తలను తప్పుడు ప్రచారం చేసింది. ఆమె చేసింది చూసి అభిమానులు, చాలా మంది ప్రముఖులు ఇలా చేయడమేంటని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు ఆహారాలతో కాలేయం సేఫ్.. ఆరోగ్యంగా ఉండాలంటే..!!