Vitamin D Injections: విటమిన్ డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి శరీరానికి, ఆరోగ్యానికి అవసరమైన అంశం. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే దాన్ని అధిగమించడానికి డైట్ ప్లాన్‌లో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. కానీ విటమిన్ లోపాన్ని సరిచేయడానికి ఇంజక్షన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విటమిన్ డి ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు ఎలా వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. విటమిన్ డి ఇంజెక్షన్లతో జాగ్రత్త: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ డి ఇంజెక్షన్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. విటమిన్ డి శరీరానికి ఎక్కువగా చేరితే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవాలంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఓ నివేదిక ప్రకారం.. విటమిన్ డి ఇంజెక్షన్లు ఎముకల బలంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇది కూడ చదవండి: ఈ భూమిని ఏ దేశం ఆక్రమించలేదు ఎక్కువ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడం కంటే డైట్ ప్లాన్‌లో మార్పు మంచి ఎంపిక. విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి కొవ్వు చేపలు, విటమిన్ డి అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం ప్రారంభించవచ్చు. గుడ్లలో విటమిన్ డి కూడా మంచి మొత్తంలో లభిస్తుంది. కావాలనుకుంటే బాదంపప్పును కూడా తినవచ్చు. అంతే కాకుండా ప్రతిరోజూ ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి లోపం కూడా చాలా వరకు దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇది కూడ చదవండి: ఈ పొరపాటు వల్ల అమ్మాయిల జుట్టు ఊడుతుంది గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడ చదవండి: బంగాళాదుంప తొక్కతో క్యాన్సర్, గుండెపోటు రావా?