IPL 2024 : విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు.. భద్రతపై అధికారుల కీలక నిర్ణయం

RCB Vs RR క్వాలిఫయర్-2 మ్యాచ్​కి ముందు ఉన్న ప్రాక్టీస్​ సెషన్​తో పాటు మీడియా సమావేశాన్ని RCB రద్దు చేసుకుంది. RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతోనే ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

IPL 2024 : విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు.. భద్రతపై అధికారుల కీలక నిర్ణయం
New Update

Virat Kohli : ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ లో భాగంగా మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా రాజస్థాన్ తో RCB  క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్​కి ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్​ సెషన్​తో పాటు మీడియా సమావేశాన్ని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరూ ఆర్సీబీ రద్దు చేసుకుంది.  RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ ప్రాణానికి ముప్పు ఉన్నట్లు వచ్చిన సమాచారంతోనే ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా.. ఇదే విషయంపై పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్​ చేశారు. అంతేకాకుండా  ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్‌ (Eliminator Match) జరుగుతున్నస్టేడియంలో భద్రతను పెంచారు.. ముప్పు కారణంగా నిన్న జరగవలసిన ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా రద్దు చేసినట్టు సమాచారం.మొన్న అహ్మదాబాద్ విమానాశ్రయంలో టెర్రర్ సస్పిషన్ కింద నలుగురు ఉగ్రవాదులని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read : ఫైనల్ కు చేరిన కేకేఆర్‌.. హైదరాబాద్‌ మీద ఘన విజయం!

ఈ నలుగురికి సంబంధించిన హైడౌట్స్​ని రైడ్​ చేసిన అనంతరం.. ఆయుదాలు, అనుమానాస్పద వీడియో- మెసేజ్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని RCB - RR  జట్లకు పోలీసులు మంగళవారం వెల్లడించగా.. దీనిపై RR టీమ్​ స్పందించలేదు. కానీ RCB టీమ్ మాత్రం.. ప్రాక్టీస్​ సెషన్​ని రద్దు చేసుకుంటున్నట్టు భద్రతా సిబ్బందికి చెప్పింది. ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ సమయంలో ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకోవడం గమనార్హం.

#rcb-vs-rr #virat-kohli #ipl-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి