/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T153423.634-jpg.webp)
Life Style Tips : బిగుతుగా ఉండే లోదుస్తులు పురుషులకు(Men's) సమస్యలను పెంచుతాయి. 2018 అధ్యయనం ప్రకారం, బిగుతుగా ఉండే లోదుస్తులు(Tight Inner Wear) ధరించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల స్క్రోటమ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే విధంగా ల్యాప్‌టాప్(Laptop) ని ఒడిలో పెట్టుకుని పని చేయడం కూడా లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. బిగుతుగా ఉండే లోదుస్తులు స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.
బిగుతైన లోదుస్తువులు ధరించడం వల్ల కలిగే నష్టాలు
- ఇదే కాకుండా బిగుతుగా ఉండే లోదుస్తులు చర్మానికి కూడా మంచిది కాదు. చర్మం రాపిడి వల్ల, తుంటి, గజ్జలు, తొడలలో చికాకు, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్(Skin Infection) కి కూడా కారణమవుతుంది.
- వ్యాయామం చేసే సమయంలో చెమట, తేమను పీల్చుకునే లోదుస్తులను ఎంచుకోకుండా, బిగుతుగా ఉండే లోదుస్తులను ధరిస్తే జననాంగాల్లోకి చెమట పట్టే అవకాశం ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
- బిగుతుగా ఉండే లోదుస్తుల వల్ల పురుషాంగంలో నొప్పి, మంట, దురద వంటి సమస్యలు ఉండవచ్చు.
సరైన లోదుస్తులను ఎలా ఎంచుకోవాలి
- లోదుస్తుల పరిమాణాన్ని ఎన్నుకునేటప్పుడు, ఎల్లప్పుడూ ఒక సైజు పెద్ద లోదుస్తులను ఎంచుకోండి. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.
- ఎల్లప్పుడూ సహజమైన బట్టనే ఎంచుకోవాలి. ఇది తేమను గ్రహించగలదు.
- లోదుస్తుల పరిశుభ్రతపై పూర్తి శ్రద్ధ వహించండి . ప్రతిరోజూ లోదుస్తులను మార్చడం తప్పనిసరి. తద్వారా బ్యాక్టీరియా పెరగదు.
- వ్యాయామ సమయంలో తేమను గ్రహించే లోదుస్తులను ఎంచుకోండి. ఇది చర్మంపై దద్దుర్లు, బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించవచ్చు.
- పురుషులకు ఉత్తమమైన లోదుస్తులు బాక్సర్లు కావచ్చు. ఇది స్క్రోటమ్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: Drinking Water: ఈ సమయంలో తాగిన నీరు ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది..!