Jackfruit Pakora : టేస్టీ, హెల్తీ జాక్ ఫ్రూట్ పకోడ.. పిల్లల బాగా ఇష్టపడతారు..! బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బెండకాయలు, పనీర్ వంటి వాటితో పకోడీలు చేసుకోవడం సహజం. ఈ సారి వెరైటీగా జాక్‌ఫ్రూట్ పకోడాలను ట్రై చేయండి. ఇది ఆరోగ్యకరమైనది కూడా. జాక్‌ఫ్రూట్‌లోని ఫైబర్, విటమిన్ ఎ, సి, థయామిన్, పొటాషియం, కాల్షియం పోషకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. By Archana 12 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Healthy Food : వర్షాకాలం (Rainy Season) ప్రారంభమైన వెంటనే, ఒక కప్పు టీతో వేడిగా క్రిస్పీ పకోడాలను తినాలనే కోరిక కూడా పెరుగుతుంది. సాధారణంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బెండకాయలు, పనీర్ వంటి వాటితో పకోడీలు తయారు చేసుకుంటారు. అయితే ఎప్పుడు రొటీన్ గా కాకుండా మీ టేస్ట్ బడ్స్‌కి మంచి ట్రీట్ ఇవ్వాలనుకుంటే.. ఈ సారి కొత్తగా, వెరైటీగా టేస్టీ జాక్‌ఫ్రూట్ పకోడా (Jackfruit Pakora) లను ట్రై చేయండి. ఇది ఆరోగ్యకరమైనది కూడా. జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, థయామిన్, పొటాషియం, కాల్షియం, రైబోఫ్లావిన్, ఐరన్, నియాసిన్, జింక్ వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. జాక్ ఫ్రూట్ పకోడాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము.. జాక్‌ఫ్రూట్ పకోడాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు 200 గ్రాముల జాక్‌ఫ్రూట్ 2 టీస్పూన్ల పిండి అర టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ యాలకుల పొడి 1/2 టీస్పూన్ పసుపు పొడి రుచికి సరిపడ కారం జాక్‌ఫ్రూట్ పకోడాలను తయారుచేసే విధానం జాక్‌ఫ్రూట్ పకోడాలు చేయడానికి, ముందుగా జాక్‌ఫ్రూట్‌ను కట్ చేయాలి. ఆ తర్వాత దాని లోపల ఉన్న పనస ముక్కలను తీసి కుక్కర్‌లో బాగా ఉడకబెట్టాలి. వాటి లోపల గింజలను తీసేయాలని గుర్తుపెట్టుకోండి. ఉడకబెట్టిన జాక్ ఫ్రూట్ ముక్కలు చల్లారిన తర్వాత వాటి పై తొక్కను తీసి మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కట్ చేసిన ముక్కల్లో ఉప్పు, పసుపు, శెనగపిండి మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేసి పకోడీల పేస్ట్‌లా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు చివరగా ఒక బాణానిలో నూనె వేసి కాసేపు వేడెక్కనివ్వండి. నూనె వేడెక్కిన తర్వాత పకోడీల ముద్దలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ జాక్ ఫ్రూట్ పకోడీ రెడీ. ఇక చివరిగా సర్వ్ చేసే ముందు వాటి పై చాట్ మసాలా (Chat Masala) వేయండి. Also Read: Healthy Teeth: ఈ నాలుగు పండ్లు తింటే పచ్చని పళ్ళు తళతళ మెరుస్తాయి..? #life-style #healthy-food #jackfruit #pakora మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి