Health Issues : సారణంగా మనిషికి ప్రతీ రోజు 7-8 గంటల నిద్ర తప్పనిసరి. అయితే ఏదో ఒక రోజు తక్కువగా నిద్ర పోవడం(Sleeping) పర్వాలేదు. కానీ రోజుల తరబడి 7-8 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కొంతమంది నిరంతరం పని చేస్తూ నిద్రను అశ్రద్ధ చేస్తారు. కానీ ఇది మీ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే, అది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచడమే కాకుండా మీ ఆలోచన, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి...
5-6 గంటలు మాత్రమే నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. దీని వల్ల రోగనిరోధక శక్తి(Immunity Power) తగ్గిపోయి శరీరం వ్యాధులతో పోరాడలేకపోతుంది. నిద్ర, రోగనిరోధక వ్యవస్థ మధ్య సంబంధాన్ని పరిశోధనలలో వెల్లడించారు. పరిశోధన ప్రకారం, శరీరం వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడినప్పుడు, సరైన నిద్ర అవసరం. తక్కువ నిద్ర కారణంగా త్వరగా అనారోగ్యానికి గురవుతారు.
రాత్రి 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం లేదా రాత్రి 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం గుండె ఆరోగ్యం(Heart Health) పై చెడు ప్రభావం చూపుతుంది,
రెండు పద్ధతులు గుండెకు హానికరం. యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రకారం, ఈ రెండూ పద్ధతులు గుండెపై ప్రభావం చూపుతాయి. నిద్రలేమి కొరోనరీ హార్ట్ డిసీజ్‌కు దారితీయవచ్చు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ ప్రమాదం
తక్కువ నిద్రపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్(Breast Cancer), కొలొరెక్టల్ క్యాన్సర్ , ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి నిద్రలేకపోతే దేని శ్రద్ధ పెట్టలేరు. ఆలోచన శక్తి తగ్గిపోతుంది. నిద్రలేమి ఆలోచన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, రాత్రి నిద్రపోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకోవడం, మెదడు పనితీరు పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది.
మరచిపోయే సమస్య
మెదడుకు పూర్తి విశ్రాంతి అవసరం, తద్వారా జ్ఞాపకశక్తిలో కొత్త సమాచారాన్ని సేకరించవచ్చు. నిద్రలేకపోతే మరచిపోయే సమస్య మొదలవుతుంది.
పురుషులను ప్రభావితం చేస్తుంది
అధ్యయనం ప్రకారం, ఒక వారం పాటు నిరంతరంగా నిద్రపోకపోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. 5 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల సెక్స్ హార్మోన్ స్థాయిలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయి.
బరువు
యువకులు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే, బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రించే వారు ఆరోగ్యంగా ఉంటారు.
మధుమేహం వచ్చే ప్రమాదం
స్థూలకాయం కారణంగా నడుము వెడల్పుగా ఉండి, తగినంత నిద్రపోకపోతే మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Mother’s Day: మదర్స్ డే స్పెషల్.. అమ్మ ప్రేమ అంతులేనిది..!