Hair Health: మీకు ఈ అలవాట్లు ఉంటే చిన్నతనంలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది!

చిన్న వయసులోనే కొందరిలో తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఆహారపు అలవాట్లు వల్ల తెల్ల జుట్టు పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాటిలో ముఖ్యంగా పొగ త్రాగడం, విటమిన్ B12, D3, కాల్షియం, ఐరన్, కాపర్, పోషకాహార లోపాలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతాయి.

Hair Health: మీకు ఈ అలవాట్లు ఉంటే చిన్నతనంలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది!
New Update

ఈ మద్య కాలం అమ్మాయిలు, అబ్బాయిల వయసుతో సంబంధం లేకుండా 20 ఏళ్లకే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. సహజంగా తెల్ల జుట్టు వయసు పైబడినప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం చాలా మందిలో ఇది ఒక సమస్యగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం జీవన శైలి విధానాలు రావడానికి ప్రధాన కారణాలని పేర్కొన్నాయి. వాటితో పాటు ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపాలు కూడా ప్రభావం చూపుతాయి.

తెల్ల జుట్టు పై ప్రభావం చూపే జీవన శైలి అలవాట్లు

పొగ తాగడం

2013 లో ఒక యునివర్సటీ చేసిన నివేదికల ప్రకారం పొగ తాగితే 30 ఏళ్ల వయసుకే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతుందని తెలిపాయి. పొగాకులోని హానికర కెమికల్స్ శరీరంలో ఆక్సిడెటివ్ ఒత్తిడికి కారణమవుతాయి. ఈ ప్రక్రియ జుట్టు రంగుకు సంబంధించిన మెలనోసైట్‌ సెల్స్ పై ప్రభావం చూపుతుంది.

ఆహారపు అలవాట్లు

ఆహారపు అలవాట్లు కూడా దీనికి ప్రధాన కారణం. విటమిన్ B12, కాల్షియం, విటమిన్ D3, ఐరన్, జింక్, వంటి పోషకాహార లోపాలు అకాల తెల్ల జుట్టుకు రావడానికి ముఖ్య కారణమవుతాయి. ఈ పోషకాలు మెలనోజెనిసిస్‌ ప్రక్రియకు తోడ్పడి.. మెలనోసైట్‌ సెల్స్ జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. నివేదికల ప్రకారం ఈ పోషకాహార లోపం ఉన్నవారిలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండడానికి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పచ్చటి ఆకుకూరలు, విటమిన్ B12( ఎగ్ యోక్, పాల ఉత్పత్తులు), కాపర్ ( నువ్వులు, జీడిపప్పు, బాదం, రెడ్ మీట్, తృణ ధాన్యాలు), జింక్( డ్రై ఫ్రూట్, గింజలు) ఎక్కువగా తీసుకోవాలి.

ఒత్తిడి, నిద్ర లేని సమస్య

ఒత్తిడి అకాల తెల్ల జుట్టు పై నేరుగా ప్రభావం చూపుతుంది. మానసిక స్ట్రెస్ ఎక్కువైనప్పుడు శరీరంలో ఆక్సిడెటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇది జుట్టు రంగు, జుట్టు రాలడానికి కారణమవుతుంది. నిద్ర లేమి, డీ హైడ్రేషన్ కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చే ప్రమాదాన్ని కలిగించును.

Also Read: ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరి పర్సు ఎక్కువగా ఖాళీగా ఉంది?

#health-tips #life-style #heair-health
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe