LIC Health Insurance: LIC హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తుందా? సంస్థ ఏం చెబుతోంది?

చాలాకాలంగా దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, LIC స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.

New Update
LIC Health Insurance: LIC హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తుందా? సంస్థ ఏం చెబుతోంది?

LIC Health Insurance: కరోనా మహమ్మారి తర్వాత, సాధారణ ప్రజలకు ఆరోగ్యంపై చాలా అవగాహన పెరిగింది. ఇప్పుడు ప్రజలు ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు, వారికి వచ్చే మొదటి ఆలోచన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి పెద్ద ప్రకటన చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్  రంగంలోకి ప్రవేశించే అధికారిక ప్రతిపాదన ఏదీ లేదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, జీవిత బీమా కంపెనీలు ఆరోగ్య బీమా పాలసీలను జారీ చేయడానికి అనుమతించరు.  హెల్త్ ఇన్సూరెన్స్  పాలసీని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లేదా హెల్త్  కంపెనీ మాత్రమే ఇవ్వవచ్చు. 

LIC ఏమంటుంది?
LIC Health Insurance: చాలా కాలం ఉంచి LIC నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే,  ప్రస్తుతానికి అటువంటి అధికారిక ప్రతిపాదన తీసుకురాలేదని తాము  స్పష్టం చేస్తున్నట్లు స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో ఎల్‌ఐసి తెలిపింది. దీనితో పాటు, దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ LIC సాధారణంగా వివిధ వ్యూహాత్మక అవకాశాలను అంచనా వేస్తుంది.  వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలతో సహా తన వ్యాపార వృద్ధి-విస్తరణ కోసం కొత్త ఎంపికలను కూడా అంచనా వేస్తుంది.

రూల్స్ ఏమి చెబుతున్నాయి?
LIC Health Insurance: ఇన్సూరెన్స్  చట్టాన్ని సవరించడం ద్వారా బీమా లైసెన్స్‌ను అనుమతించవచ్చు. ఇన్సూరెన్స్  చట్టం, 1938 - ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నియమాల ప్రకారం, ఒక యూనిట్ కింద జీవిత, సాధారణ లేదా ఆరోగ్య బీమాను జారీ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటికీ లైసెన్స్ అనుమతించరు. అంటే ఒక కంపెనీ ఒక విభాగానికి మాత్రమే లైసెన్స్ పొందవచ్చు. LIC జీవిత బీమా పాలసీలను అందిస్తుంది. అందువల్ల చట్ట సవరణ లేకుండా.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వడానికి వీలు పడదు. 

Also Read: యాక్సిస్ బ్యాంక్ కు రూ.1.66 కోట్ల జరిమానా!

LIC బిజినెస్ ఇలా..
LIC Health Insurance: జీవిత బీమా రంగంలో నెలవారీ కొత్త వ్యాపార ప్రీమియం (NBP)లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వాటా సెప్టెంబర్ 2023లో 58.50 శాతానికి తగ్గింది. ఇది సెప్టెంబర్ 2022లో 68.25 శాతంగా ఉంది. అంటే 975 బేసిస్ పాయింట్ల క్షీణత నమోదైంది. అయితే, ఈ ఏడాది ఆగస్టులో నమోదైన 57.37 శాతం నుంచి మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగింది. దీన్ని బట్టి మార్కెట్‌లో ఎల్‌ఐసీ ఎంత పెద్ద ప్లేయర్‌గా ఉందో మీరు ఊహించవచ్చు. 2023 మొదటి ఆరు నెలల్లో జీవిత బీమా పరిశ్రమ ఎన్‌బిపి సుమారు 13 శాతం క్షీణించి రూ. 1.59 ట్రిలియన్లకు చేరుకుంది.

Advertisment
తాజా కథనాలు