LIC In Top : భారత బీమా కంపెనీ ఎల్‌ఐసీ(LIC) తనకు తిరుగులేదు అనిపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) అగ్రస్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 ఇచ్చిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ 9.8 బిలియన్ డాలర్లు అంటే రూ.81,500 కోట్లుగా ఉంది. దాంతో పాటూ బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ స్కోరు 88.3తో, బ్రాండ్ స్ట్రెంత్ రేటింగ్ ఏఏఏ తో అన్ని కంపెనీల కంటే ఎల్‌ఐసీ ముందుంది.
చైనా బ్రాండ్ల విలువ ఎక్కువ...
ఇక ఎల్‌ఐసీ తర్వాత కాథే అనే బీయా కంపెనీ రెండో స్థానంలో ఉంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ 9 శాతం వృద్ధితో 4.9 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను కలిగి ఉంది. అయితే ఎల్‌ఐసీ, కాథేలు ముందంజలో ఉన్న విలువల పరంగా చూస్తే మాత్రం చైనా బీమా బ్రాండ్లు ఆధిపత్యంలో ఉన్నాయి. అంతర్జాతీయంగా వీటి మార్కెట్ విలువ అందరి కంటే ఎక్కువగా ఉంది. వీటిల్లో పింగ్ యాన్ బ్రాండ్ విలువ 4% పెరిగి 33.6 బి. డాలర్లకు చేరడంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన బీమా బ్రాండ్(Insurance Brand) గా నిలిచింది. మూడు, అయిదు స్థానాల్లోనూ చైనాకే చెందిన చైనా లైఫ్ ఇన్సూరెన్స్, సీపీఐసీ ఉన్నాయి. జర్మనీ, ఆస్ట్రేలియా బీయా బ్రాండ్లు కూడా మొదటి పది స్థానాల్లో నిలిచాయి.
పెరిగిన ఎల్‌ఐసీ షేర్లు..
2022-23లో ఎల్‌ఐసీ ఏడాది ప్రీమియం వసూళ్ళు చాలా ఎక్కువగా పెరిగాయి. ఈ ఏడాదిలో అత్యధికంగా మొదటిసారి 39,090రూ. కోట్లను వసూలు చేశాయి. ఈ ఏడాది మొదట్లో ఎసీబీఐను వెనక్కు నెట్టి ఎల్‌ఐసీ ముందు వచ్చేసింది. ఎల్‌ఐసీ షేరు జీవనకాల గరిష్ఠమైన రూ.1175కు చేరడంతో, భారత్(India) లోనే అత్యంత విలువైన ప్రభుత్వ రంగ కంపెనీగా అవతరించింది. దాంతో దాని మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది. దీని తరువాత ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ వరుసగా రూ.15,197 కోట్లు, రూ.10,970 కోట్ల ఏడాది ప్రీమియంలు నమోదు చేశాయి.
Also Read : SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్‌లపై మోత