Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు..

శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు.

New Update
Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం.. భయాందోళనలో భక్తులు..

Leopard in Srisailam: శ్రీశైలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైల క్షేత్రం(Srisailam) సమీపంలోని పాలధార-పంచదార వద్ద చిరుతపులి(Leopard) సంచరించింది. పాలధార పంచదార వద్ద ఉన్న రక్షణ గోడపై చిరుత పులి కూర్చొని ఉంది. అయితే, శ్రీశైల క్షేత్రానికి కారులో వెళ్తున్న భక్తులు ఆ చిరుతను గుర్తించారు. అటుగా వెళ్తుండగా.. ఒక్కసారిగా చిరుత కనిపించడంతో తమ కారును ఆపి చిరుతను పరిశీలించారు. అది నిజంగానే చిరుతనా కాదా? అని పరిశీలించారు. కారు లైట్స్ ఆన్ చేసి పరిశీలించగా.. చిరుత క్లియర్‌గా కనిపించింది. ప్రయాణికులు గట్టిగా అరవడంతో.. చిరుత బెదిరిపోయింది. అరుపులు కేకలు వేయడంతో ఆ చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే, గోడపై విశ్రాంతి తీసుకుంటున్న చిరుతను భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

కొంత కాలంగా తరుచగా అడవి బయటకు వస్తున్నాయి చిరుత పులులు. రెండు నెలల వ్యవధిలోనే శ్రీశైలం పరిధిలో చిరుత పులులు అనేకసార్లు కనిపించాయి. చిరుత పులలే కాదు.. ఇతర క్రూర మృగాలు కూడా జన సంచార ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తించాయి. నెల రోజుల క్రితం శ్రీశైల శిఖర క్షేత్రం వద్ద ఎలుగుబంటి సంచారం భక్తులను హడలెత్తించింది. భక్తులు కొట్టే కొబ్బరి కాయల కోసం రోజూ వచ్చి హల్ చేసింది ఎలుగుబంటి. ఈ దృశ్యాలు అక్కడి సిసి కెమెరాలో రికార్డ్ అవగా.. ఫారెస్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. చివరకు ఎలుగుబంటి బోనులో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇటీవలి కాలంలో శ్రీశైలం పరిధిలో చిరుతల సంచారం పెరిగింది. తరచుగా రోడ్డుపై కనిపిస్తూ భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

తిరుమల లక్షిత ఘటన..

తిరుమల నడక దారిలో నెల్లూరు చెందిన చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన ఇప్పటికీ భక్తుల కళ్ల ముందే కదలాడుతోంది. ఈ ఘటన నేపథ్యంలోనే తిరుమలలో అలర్ట్ అయిన అధికారులు.. ఇప్పటి వరకు 5 చిరుతలను బంధించారు. ఇప్పటికీ తిరుమల నడక దారిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో శ్రీశైలంలోనూ చిరుత పులుల సంచారం భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. పాలదార పంచదార వద్ద చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు భక్తులు. తరచుగా జనసంచారం ఉన్న ప్రారంతాల్లో చిరుత వస్తుండటంతో.. అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు.

పాలదార పంచదార వద్ద కనిపించిన చిరుత ఇదే..

Also Read:

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. కృష్ణా ఎక్స్‌ ప్రెస్ తో పాటు ఆ 24 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే..

India vs Australia World Cup 2023: ఆరంభం అదుర్స్.. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం..

Advertisment
తాజా కథనాలు