మీరు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ గానీ, ఇంటర్నెట్ గానీ వాడుతున్నారా...అయితే జాగ్రత్త అంటోంది ఇండియన్ సైబర్ సెక్యూరిటీ. ఎందుకంటే వేలమంది బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, ఇంటర్నెట్ కనెక్షన్లు లీక్ అయ్యాయి. పారెల్ల్ అనే డార్క్ వెబ్ ఈ కనెక్షన్లు అన్నింటినీ హ్యాక్ చేసిందని చెబుతోంది. దీని ద్వారా యూజర్ల ఈ మెయిల్ అడ్రెస్ లు. బిల్లింగ్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు అన్నీ పెరెల్ల్ వెబ్ చేతిలోకి వెళ్ళిపోయాయని...వారు వాటిని ఎలా అయినా మిస్ యూజ్ చేయొచ్చని చెబుతున్నారు.
Also Read:యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి
ఈ మొత్తం వ్యవహారం అంతా ఒక పేరులేని వ్యక్తులు, సంస్థ ద్వారా జరిగిందని చెబుతోంది సైబర్ సెక్యూరిటీ. ఇందులో మొత్తం 32వేల మంది వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళాయని ిప్పటికి తెలిసింది. వారిదగ్గర ఇంకా 2.9 మిలియన్ లైన్ల డాటా ఉందని అనుమానం అని చెబుతున్నారు. ఇందులో ఇండియాలో జిల్లాల వారీగా మొత్తం సమాచారం వారిదగ్గరకు వెళ్ళిపోయిందని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించొచ్చని అంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ కనిష్క్ గౌర్. ఈ డాటా చౌర్యం వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలగడంతో పాటూ వారి బ్యాంక్ వివరాలు, ఐడెంటిటీ దొంగతనాలులాంటివి కూడా జరగొచ్చని చెబుతున్నారు. బీఎస్ఎన్ఎల్ దీనిని సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. యూజర్లకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు.
Also Read:ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే!