Telangan Elections 2023:ఎన్నికల సందర్బంగా దేవాలయాల బాట పడుతున్న అగ్ర నేతలు

రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. నిన్నటి వరకూ ప్రచారంలో మునిగిపోయిన నేతలు ఈరోజు దేవాలయాల బాట పడుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రార్ధనలు చేస్తున్నారు.

New Update
Telangan Elections 2023:ఎన్నికల సందర్బంగా దేవాలయాల బాట పడుతున్న అగ్ర నేతలు

నిన్నటి వరకూ నాయకులంతా క్షణం తీరిక లేకుండా తిరిగారు. నోరు నొప్పెట్టేలా మాట్లాడుతూ...కాళ్ళు అరిగేలా తిరుగుతూ ప్రచారాలు చేశారు. దాదాపు నెల రోజులు ఏకదీక్షగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఒక గంట ఇక్కడ ఉంటే మరో గంట ఎక్కడో ఉన్నారు. కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రా లనుంచి కూడా అగ్రనేతలు, నాయకలు వచ్చి తెలంగాణ అంతా ప్రచారాలతో హోరెత్తించారు. రేపు పోలింగ్ అవడంతో రెండు రోజులు ముందుగా అంటే నిన్న సాయంత్రం నుంచి ప్రచారాలకు తెరపడింది. ఇంక ఎవ్వరూ నోరు తెరవకూడదని ఈసీ గఅందరికీ గట్టిగా చెప్పేసింది. దీంతో ఈ రెండు రోజులు చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టారు రాష్ట్రంలోని నేతలు.

Also read:కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం

ఈ సారి తెలంగాణ ఎలక్షన్స్ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలా అయినా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. దానికి తగ్గట్టు మేనిఫెస్టోలు రాసుకున్నారు, ప్రచారాలు నిర్వహించుకున్నారు. అంతా అయిపోయింది తదుపరి కార్యక్రమం ప్రజల చేతుల్లోనే ఉంది. దీంతో నాయకులు దేవాలయాల బాట పడుతున్నారు. ప్రజలు తమకు ఓటేసేలా చెయ్యె దేవుడా అంటూ మొక్కు మొక్కుకుంటున్నారు. ఈరోజు ఉదయం
చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. మరికొందరు కూడా ఇక్కడకు రానున్నారని తెలుస్తోంది. దీంతో భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్న ఓల్డ్ సిటీని పోలీసులు నిఘా కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాలా కాస్తున్నారు.

మరోవైపు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ హనుమంతరావు తదితరులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. రేపు పోలింగ్ సందర్భంగా ఏం చేయాలి. కార్యకర్తలకు ఏఏ పనులు నిర్దేశించాలి అన్న విషయాల మీద చర్చించుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ అయిన తర్వాత కార్యచరణ గురించికూడా డిస్కషన్స్ అవుతున్నాయని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు