/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MP-RAHUL-GANDHI.jpg)
Rahul Gandhi : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ (NEET Paper Leak) అంశంపై లోక్ సభ (Lok Sabha) లో చర్చ జరగాలని అన్నారు ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఆయన మాట్లాడుతూ.."నిన్న, ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ సమావేశమయ్యారు. ఈ రోజు, మేము నీట్ అంశంపై చర్చను కోరుకుంటున్నాము. నీట్‌పై ఇక్కడ చర్చ జరగాలని ఏకగ్రీవంగా జరిగింది. సభలో నేను ప్రధానమంత్రిని అభ్యర్థిస్తున్నాను, ఇది యువతకు సంబంధించిన అంశం. దీనిపై గౌరవప్రదమైన చర్చగా ఉండాలి, మీరు కూడా చర్చలో పాల్గొనాలి. భారత ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాయని పార్లమెంటు నుంచి సందేశం రావాలి." అని అన్నారు. ఈ క్రమంలో నీట్ అంశంపై పార్లమెంట్ (Parliament) లో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రెవేశ పెట్టారు.
#WATCH | Leader of Opposition in Lok Sabha, Rahul Gandhi says, "Yesterday, all the leaders of the opposition parties had a meeting and it was unanimous that today, we want a discussion on the NEET issue...There should be a discussion on NEET here in the House. I request the Prime… pic.twitter.com/ZhQo9c0lkA
— ANI (@ANI) June 28, 2024
Also Read : ‘భారత్ మాతాకీ జై..’ ఒవైసీ ఇంటిపై మరోసారి అటాక్!