Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి?

కాళేశ్వరం ప్రాజెక్టులో తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని న్యాయవాది రాపోలు భాస్కర్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు,కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు పై కేసు నమోదు చేయాలని కోరారు.

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి?
New Update

కాళేశ్వరం(Kaleshwaram).. తెలంగాణ ఎన్నికలు దీని చుట్టూనే తిరిగాయి. కేసీఆర్‌ టార్గెట్‌గా రేవంత్‌ నుంచి షర్మిల వరకు అందరూ ఇదే విషయాన్ని దాదాపు అన్నీ సభల్లోనూ లేవనేత్తారు. 2జీ, కోల్‌గేట్‌ కంటే కాళేశ్వరం కుంభకోణం పెద్దదంటూ బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ దాడి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవకతవకలను జాతీయ స్థాయిలో బహిర్గతం చేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు స్పీచ్‌ల్లో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్‌కే వచ్చింది. రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. ఇది జరిగిన కాసేపటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు అందింది.

ఫిర్యాదు గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు:
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది రాపోలు భాస్కర్‌. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌ రావు, కవిత, మెఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని కోరారు. తప్పుడు అంచనాలతో వేలకోట్లు దారి మళ్లాయని ఫిర్యాదు చేశారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని న్యాయవాది రాపోలు భాస్కర్‌ కోరారు. రాపోలు భాస్కర్‌ గతంలో కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఎక్స్‌-జర్నలిస్ట్‌ కూడా.

వేల కోట్ల దోపిడి జరిగిందా?
ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాదికోట్లు దోపీడీ జరిగిందంటున్నారు భాస్కర్. తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని చెబుతున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని రాపోలు భాస్కర్ కోరగా.. ఇక కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కాళేశ్వరం విషయంలో నెక్ట్స్ ఏం స్టెప్‌ తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి 2014 నుంచి 2018 వరకు నీటిపారుదలశాఖ మంత్రిగా హరీశ్‌రావు ఉండగా.. రెండో విడత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేసీఆరే ఈ బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఈ కేసు ముందుకు వెళ్తే ఈ ఇద్దరికీ ఇబ్బంది తప్పవన్నవాదన వినిపిస్తోంది. అటు మెఘా కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

Also Read: గూగుల్ ఏఐ జెమినీ వచ్చేసింది.. స్పెషాలిటీ ఇదే

WATCH:

#kcr #kaleshwaram-project #rapolu-bhaskar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe