Salman khan: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!

పంజాబీ సింగర్‌ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు 18 ఏళ్ల వయసున్న షార్ప్ షూటర్లతో రూ.25 లక్షల కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పాక్ నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించారన్నారు.

New Update
Salman khan: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!

Salman khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భారీ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. అచ్చంగా పంజాబీ సింగర్‌ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం 18 ఏళ్ల యువకులైన షార్పు షూటర్లను బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

తుర్కియే నుంచి జిగాన పిస్టోళ్లు..
ఈ మేరకు సల్మాన్ సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లివస్తుండగా.. ఖతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని, సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు కూడా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య ఈ ప్లాన్ రెడీ చేశారు. తుర్కియే (టర్కీ) నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. తుర్కియేకు చెందిన ‘టిసాస్‌’ కంపెనీ ఈ సెమీ-ఆటోమేటిక్‌ ఆయుధాన్ని తయారుచేస్తుండగా ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.6 లక్షలుంటుంది. అక్కడి సైన్యం, స్పెషల్‌ ఫోర్సెస్‌, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వాటిని వాడుతున్నాయి. భారత్‌లో వీటిపై నిషేధం ఉందని చెప్పారు.

పాక్‌ సరిహద్దులు దాటించి..
దీంతోపాటు పాకిస్థాన్‌ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని, ఈ తుర్కియే తుపాకులకు పాకిస్థాన్‌ డమ్మీలు తయారుచేస్తోందని గుర్తించారు. పాకిస్థాన్‌లో ‘గన్‌ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్‌ ఖేల్‌’ అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధాల షాపులుండగా.. జిగాన తుపాకులు అధునాతన గన్స్‌ కంటే చవకగా లభిస్తాయి. వీటితోపాటు ఏకే-47, ఏకే92ఎస్‌, ఎం16 రైఫిల్స్‌ను పాక్‌ నుంచి సరిహద్దులు దాటించి తెచ్చేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 70 మందితో భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి.. సల్మాన్‌ కదలికలపై నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇక ఈ కుట్రలో భాటియా, వాస్పి మహమ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ చైనా, రిజ్వాన్‌ హసన్‌ అలియాస్‌ జావెద్ ఖాన్‌, దీపక్‌ హవా సింగ్‌ భాగమైనట్లు గుర్తించారు.

డీసీపీ వివేక్‌ పన్సారే..
ఈ కేసుపై ముంబై సర్కిల్‌ డీసీపీ వివేక్‌ పన్సారే మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరపడానికి నలుగురు మనుషులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారు. మొత్తం 25 మంది వరకు ప్లానింగ్‌లో భాగమయ్యారు. వీరందరినీ అజయ్‌ కశ్యప్‌ సమన్వయం చేశాడు. ఈ కుట్ర అమలుకు వాడే ఆయుధాల సమాచారం అతనికి బాగా తెలుసు. ముఠా ఎస్కేప్‌ ప్లానింగ్‌ కూడా పక్కాగా ఉందని డీసీపీ వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల మొబైల్‌ ఫోన్లలో సల్మాన్‌పై ఎలా దాడి చేయాలో సూచనలు చెబుతున్న వీడియోలు కూడా పోలీసులకు లభించాయని, పాక్‌లోని ఆయుధ డీలర్లతో తాను టచ్‌లో ఉన్నట్లు అజేయ్‌ ఇంటరాగేషన్‌లో అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు