NRIs: ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీటి వ్యవహారంపై తాజాగా స్పందించిన న్యాయ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాహాలకు సంబంధించి ఓ సమగ్రమైన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఎన్నారైలు, ఓసీఐలు- భారతీయుల మధ్య జరిగే పెళ్లిల్లను ఇండియాలో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచనలు చేసింది.
Also Read: ఎలాన్ మస్క్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?
అంతేకాదు ఈ అంశాలపై రూపొందించిన ఓ రిపోర్టును కూడా న్యాయశాఖకు సమర్పించింది. అయితే ఇందుకు సంబంధించిన పెళ్లిల్లు.. ఇండియాకు చెందిన జీవిత భాగస్వాములను.. ముఖ్యంగా మహిళలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నాయని కొన్ని రిపోర్టులు ప్రస్తావిస్తున్నట్లు పేర్కొంది. విడాకులు, పిల్లల సంరక్షణ, ఎన్నారైలు, ఓసీఐలకు సమన్లు, వారెట్లు, ఇతర న్యాయపరమైన పత్రాల జారీకి సంబంధించి నిబంధనలను సమగ్ర చట్టంలో చేర్చాలని కమిషన్ ఛైర్‌పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రుతురాజ్ అవస్థీ చెప్పారు.
పాస్‌పోర్టుపై పెళ్లి స్టెటస్, జీవిత భాగస్వామి పాస్‌పోర్టును అనుసంధానం చేయడం అలాగే భార్యభర్తలిద్దరి పాస్‌పోర్టులపై వివాహ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పొందుపర్చడం వంటివి తప్పనిసరి చేయాలని న్యాయ కమిషన్ కేంద్రానికి ప్రతిపాదన చేసింది. ఇందుకోసం పాస్‌పోర్టు చట్టం,1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని సూచనలు చేసింది.
Also Read: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక