Lavanya tripati: ఆ విషయంలో ఉపాసన బాటలో లావణ్య!

మెగా కంపౌడ్‌ చిన్న కోడలు లావణ్య త్రిపాఠి ఓ విషయంలో పెద్ద కోడలు ఉపాసనను ఫాలో అవుతుందంటూ నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతుంది. పెళ్లి తరువాత కొణిదెల ఇంటి పేరును లావణ్య తన పేరు పక్కన చేర్చుకోవడంతో ఈ విషయం వైరల్‌ గా మారింది.

Lavanya tripati: ఆ విషయంలో ఉపాసన బాటలో లావణ్య!
New Update

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ..మెగా ఇంటి కోడలు అయిపోయింది లావణ్య త్రిపాఠి. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ అమ్మాడికి మంచి హిట్లే ఉన్నాయి. నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనాలో మరింత అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

మిస్టర్‌ సినిమా సమయంలో మెగా ప్రిన్స్‌ తో ప్రేమలో పడటం..ఈ ఏడాది నిశ్చితార్థం..పెళ్లితో మెగా కంపౌడ్‌ లోకి అడుగు పెట్టేసింది. నిన్నటి వరకు ఫారిన్ ట్రిప్ లో ఉన్న ఈ జంట ప్రస్తుతం హైదరాబాద్‌ కి చేరుకుంది. తాజాగా లావణ్యకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ గా మారింది.

అది ఏంటంటే...లావణ్య త్రిపాఠి తన తోడికోడలు ఉపాసన రామ్‌ చరణ్‌ ని ఫాలో అవుతుందని నెటిజన్లు అంటున్నారు. అది ఎలా అంటే..ఉపాసన చరణ్‌ తో పెళ్లికి ముందు వరకు తన సోషల్‌ మీడియా అకౌంట్లు అన్నిటికి ఉపాసన కామినేని అని ఉండేది. మెగా కోడలు అయిన తరువాత ఉపాసన కామినేని కొణిదెల అని చేర్చుకుంది.

ఇప్పుడు అదే పద్దతిని లావణ్య కూడా పాటించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే..లావణ్య త్రిపాఠి కొణిదెల అని తన సోషల్‌ మీడియా అకౌంట్లు కనిపిస్తున్నాయి. దీంతో అక్క బాటలోనే చెల్లి కూడా వెళ్తుందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్‌ గా మారి ట్రెండ్‌ అవుతుంది.

Also read: హైదరాబాద్‌ లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..ఏం తినేట్టు లేదంటున్న సామాన్యుడు!

#lavanya-tripati #sur-name #upasana-konidela
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe