/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/lavanya-1-jpg.webp)
గతేడాది చివరిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తో ఏడడుగులు వేసి మెగా ఇంటి చిన్న కోడలు అయిపోయింది సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి (Lavanya tripati) . కొద్ది రోజుల క్రితమే అత్తావారింట్లో కొత్త కాపురం కూడా మొదలు పెట్టారు. తాజాగా లావణ్య పెళ్లి తరువాత ఓ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పెళ్లి అయిన తరువాత కూడా లావణ్య ''మిస్'' గానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు పెళ్లి అయ్యాక శ్రీమతి కుమారిగా రావడం ఏంటని ఆడియన్స్ కి పెద్ద డౌటే వచ్చి పడింది. అసలు విషయం ఏంటంటే... పెళ్లి అయిన తరువాత మొట్టమొదటి సారి లావణ్య ఓ వెబ్ సిరీస్(Web series) లో నటించబోతున్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందించిన మిస్ పర్ఫెక్ట్ (Miss Perfect) వెబ్ సిరీస్ లో లావణ్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సిరీస్ కి విశ్వక్ ఖండే రావు డైరెక్టర్. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను బుధవారం విడుదల చేశారు.
దీనిని షేర్ చేసిన లావణ్య ''పర్ఫెక్ట్ నోట్‌తో న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తున్నా. మిస్ పర్ఫెక్ట్ సార్... మిస్ పర్ఫెక్ట్ అంతే'' అని ట్వీట్ చేశారు
ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ నటిస్తున్నారు. ఈ సిరీస్ లో లావణ్య కి జోడిగా ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ఈ పోస్టర్ లో అభిఙ్జ కూడా ఉన్నారు. ఆమె కూడా ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నారని టాక్. ఇంతకు ముందు వచ్చిన సిరీస్ లతో పోలిస్తే ఈ సిరీస్ చాలా భిన్నంగా ఉందని తెలుస్తుంది.
.
అతి త్వరలోనే ఈ సిరీస్ విడుదల కు ప్రణాళికలు చేస్తున్నారు. ఇందులో లావణ్య కార్పొరేట్ బాస్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. లావణ్యకి ఇది రెండో వెబ్ సిరీస్. ఇంతకు ముందు ఆమె పులి మేక వెబ్ సిరీస్ చేశారు.
Starting this new year on a perfect note!
— Lavanyaa konidela tripathhi (@Itslavanya) January 3, 2024
Miss Perfect sir, Miss Perfect anthe 👌#MissPerfectonHotstar Coming Soon only on #DisneyPlusHotstar@Abijeet @abhignya_v #VishvakKhanderao @AnnapurnaStdios #SupriyaYarlagadda @adityajavvadi @prashanthvihari @disneyplushstel pic.twitter.com/An6XjCbWuk
Also read: ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణకు కీలక పదవి అప్పగించిన పవన్