🔴 Tirumala Stampede Live Updates: తిరుపతిలో మహా విషాదం.. లైవ్ అప్డేట్స్!

author-image
By Manoj Varma
New Update
Tirupati Stampede Live Updates

Tirupati Stampede Live Updates

  • Jan 09, 2025 16:56 IST
    తిరుపతి బయలుదేరిన మాజీ సీఎం వైయస్ జగన్

    తాడేపల్లి నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైయస్ జగన్.

    గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో మాజీ మంత్రి రోజాతో పాటు సతీసమేతంగా బయలుదేరి వెళ్లిన జగన్.

    తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించనున్న  మాజీ సీఎం జగన్.



  • Jan 09, 2025 14:17 IST
    చంద్రబాబు లెగ్ మహత్యం.. తిరుపతి ఘటనపై రోజా ధ్వజం!

    తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. ప్రభుత్వం, టీటీటీ ఫెయిల్ అయ్యాయన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు.

    YCP Leader Roja
    YCP Leader Roja

     



  • Jan 09, 2025 14:13 IST
    తిరుమలకు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

    టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై, ఆగ్రహం వ్యక్తం చేసిన  ఏపీ సీఎం
     
    పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి చంద్రబాబు
     
    సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం 

    క్యూలైన్లో 2000 మంది భక్తులు పడతారు అనుకున్నప్పుడు

    2500 మంది భక్తులను ఒకేసారి వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం .. తమాషా చేస్తే ఊరుకునేది లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు



  • Jan 09, 2025 14:00 IST
    తిరుపతికి పవన్ కల్యాణ్

    * రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి తిరుపతి బయలుదేరారు.
    * తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.



  • Jan 09, 2025 13:21 IST
    టీటీడీ నిర్లక్షంగా లేదు-- చింతా మోహన్



  • Jan 09, 2025 13:20 IST
    ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు-రోజా



  • Jan 09, 2025 12:49 IST
    చంద్రబాబు అసమర్దత కారణంగానే ఈ ఘటన-రోజా



  • Jan 09, 2025 12:40 IST
    తిరుమలలో భారీ ట్రాఫిక్ జాం

    తిరుమలలో తొక్కిసలాట ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు. కానీ ఇంతలోనే భక్తులు వెంకటేశ్వురుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో తిరుమలలోని ఘాట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

    Tirumala Ghat road
    Tirumala Ghat road Photograph: (Tirumala Ghat road)

     



  • Jan 09, 2025 12:40 IST
    తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు!

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 

    Tirupati Stampede
    Tirupati Stampede Police Filed 2 Cases

     



  • Jan 09, 2025 10:20 IST
    తిరుపతి తొక్కిసలాట పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి!

    తిరుపతి తొక్కిసలాటపై ప్రధాన మోదీతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

    CM Revanth Reddy Review on RRB
    CM Revanth Reddy

     



  • Jan 09, 2025 09:40 IST
    తిరుపతి ఘటన..తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల పట్ట తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన ఎంతో బాధించిందని, మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

    PM Modi tpt
    PM Modi tpt Photograph: (PM Modi tpt)

     



  • Jan 09, 2025 09:39 IST
    అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

    తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది అనేది పూర్తి వివరాలు ఈ కింది ఆర్టికల్‌ లో..

    ttd
    TIrumala

     



  • Jan 09, 2025 09:38 IST
    ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

    తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి స్పదించారు. ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు పగ్గాలిచ్చారని ఆయన మండిపడ్డారు.

    నాస్తికుడంటూ తనపై చేస్తున్న విమర్శలకు భూమన స్ట్రాంగ్ రిప్లై...!



  • Jan 09, 2025 08:27 IST
    తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు. అసలిదంతా ఒక భక్తురాలి కోసం గేట్లు తీయడంతో జరిగిందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్‌లో...

    tml
    tirumala stampede

     



  • Jan 09, 2025 08:26 IST
    తిరుపతి తొక్కిసలాట.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు

    తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీకి సంబంధించి తొక్కిసలాట ఘటన పై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.

     



  • Jan 09, 2025 08:24 IST
    తొక్కిసలాటకు కారణం అదే.. TTD చైర్మన్ సంచలన వీడియో!

    తిరుమలలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమని టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అన్నారు. ఆడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతుల వల్లనే తొక్కిసలాట జరిగిందని ఆయన ఆన్నారు.

    BR
    B.R.Naidu, TTD Chairman

     



  • Jan 09, 2025 08:23 IST
    తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

    తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాయపడిన వారిలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

    టీటీడి
    తిరుమల తొక్కిసలాట

     



  • Jan 09, 2025 08:23 IST
    తిరుపతి తొక్కిసలాట వెనుక కుట్ర కోణం?

    తిరుమల తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్తకంగా దీనికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు వారు ఎవరనేదానిపై ఆరాలు తీస్తున్నారు పోలీసులు. 



  • Jan 09, 2025 08:22 IST
    తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు



  • Jan 09, 2025 08:21 IST
    తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు మృతి



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు