🔴 LIVE NEWS: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

author-image
By Nikhil
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 01, 2025 10:12 IST
    రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

    తెలంగాణ వెదర్‌పై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయన్నారు. రాబోయే ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    Snow Effect In Telangana
    Snow Effect In Telangana

     



  • Jan 01, 2025 10:11 IST
    రైతులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక 10 వేలు!

    ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    PM Modi : కొండచరియలు విరిగిపడిన ఘటనపై మోదీ పోస్ట్



  • Jan 01, 2025 10:10 IST
    మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తుండగా..తెలంగాణలో ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నారు.



  • Dec 31, 2024 18:14 IST
    2025కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన తొలి దేశం ఇదే.. వీడియో వైరల్

    న్యూజిలాండ్‌లో తొలి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. 2025 సంవత్సరానికి వెల్‌కమ్ చెబుతూ ఆక్లాండ్‌ వాసులు న్యూఇయర్‌ వేడుకల్ని ప్రారంభించారు. బాణాసంచా పేల్చుతూ సంబురాలు జరుపుకున్నారు. అమెరికన్ సమోవా, బేకర్ ద్వీపాలు చివరిగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటాయి.



  • Dec 31, 2024 12:17 IST
    తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో హత్య

    1500 రూపాయల లావాదేవీ  కారణంగా వివాదం



  • Dec 31, 2024 12:16 IST
    సింహాద్రి అప్పన్న ఆలయంలో మోసం..

    భక్తుడికి సింహాచలం ఆలయ ఉద్యోగి టోకరా

    అంతరాలయ దర్శనం కోసం 1800 వసూలు చేసిన శానిటరీ విభాగంలో ఉద్యోగి

    దర్శనం పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసిన

    హైదరాబాద్ భక్తుడు

    ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన.,విచారణ ప్రారంభించిన దేవస్థానం అధికారులు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు