🔴 LIVE BREAKINGS: సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచిన దొంగ... హీరోకు తీవ్రగాయాలు

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Jan 16, 2025 08:34 IST

    హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్

    అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌  మూసివేస్తున్నామని.. ప్రకటించారు ఫౌండర్ నాట్ ఆండర్సన్. దీనిపై ఒక లేఖను విడుదల చేశారు. అయితే ఎందుకు మూసేస్తున్నామన్న విషయం మాత్రం చెప్పలేదు. 

    usa
    Hinden Burg

     



  • Jan 16, 2025 08:31 IST

    సైఫ్ అలీ ఖాన్ను కత్తితో పొడిచిన దొంగ... హీరోకు తీవ్రగాయాలు

    నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది . చోరీ సమయంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో  సైఫ్ అలీఖాన్‌ స్వల్పంగా గాయపడగా.. ఆయనను  లీలావతి ఆసుపత్రిలో చేర్చారు.

    Saif Ali Khan
    Saif Ali Khan Photograph: (Saif Ali Khan)

     



  • Jan 16, 2025 08:13 IST

    ఒక్క ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు.. మీ అకౌంట్ లోకి రూ.50 వేలు!

    కోవిడ్ -19 మహమ్మారి తరువాత, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా చిరు, వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు ఆర్థిక భరోసాని కేంద్రం కలిపిస్తుంది.

    aadhar card loan
    aadhar card loan Photograph: (aadhar card loan )

     



  • Jan 16, 2025 08:07 IST

    ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన

    అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇండియా వెళ్ళిన హెచ్–1బి వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఏ నిమిషంలో అయినా ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారిపోవచ్చని...జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు. 

    usa
    H!-B Visa

     



  • Jan 16, 2025 07:43 IST

    వావ్.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్లు.. మరీ ఇంత చీపా!

    ఛాంపియన్స్ ట్రోఫీ సంబంధించి స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల ధరలను విడుదల చేసింది పీసీబీ బోర్డు. ఇందులో టికెట్ రూ.1000గా ఫిక్స్ చేసింది. అంటే ఇది భారత్ లో రూ. 310లతో సమానం అన్నమాట.  ఇది నిజంగా అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.

    ind vs pak Champions Trophy
    ind vs pak Champions Trophy Photograph: (ind vs pak Champions Trophy)

     



  • Jan 16, 2025 07:25 IST

    వణుకుతున్న తెలంగాణ...మరో మూడు రోజులు ఇదే పరిస్థితి!

    తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

    fog telangana
    fog telangana

     



  • Jan 16, 2025 07:24 IST

    సొంత ఇల్లు, కారు లేవట.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్ ఆస్తులు ఇవే!

    ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో  కేజ్రీవాల్ తనకు ఇల్లు, కారు లేదని వెల్లడించారు. తన ఆస్తులను రూ.1.73 కోట్లుగాప్రకటించారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు తెలుపగా తనపై 14 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

    Arvind Kejriwal declares assets
    Arvind Kejriwal declares assets Photograph: (Arvind Kejriwal declares assets)

     



  • Jan 16, 2025 07:23 IST

    నేడు ఈడీ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా!

    ఫార్ములా-ఈ కారు రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 : 30 గంటలకు నందినగర్ లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈడీ విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది

    ktr ed
    ktr ed Photograph: (ktr ed)

     



  • Jan 16, 2025 07:18 IST

    కుంభమేళా ఎఫెక్ట్‌.. విమాన టికెట్‌ ధరలు చుక్కల్లోనే

    యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ కు వెళ్లే విమానాల టికె్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్‌ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.అంటే టికెట్‌ ధర రూ.17,796 గా కొనసాగుతోంది.

    Also Read : https://rtvlive.com/national/maha-kumbh-bookings-airfares-rise-for-prayagraj-flights-8625371



Advertisment
తాజా కథనాలు