సైఫ్ అలీ ఖాన్ను ఇంట్లో దొంగతనం.. హీరోను కత్తితో పొడిచి పరార్

నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది . చోరీ సమయంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో  సైఫ్ అలీఖాన్‌ స్వల్పంగా గాయపడగా.. ఆయనను  లీలావతి ఆసుపత్రిలో చేర్చారు.

New Update
SaifAliKhan

SaifAliKhan Photograph: (SaifAliKhan)

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్  ఇంట్లో 2025 జనవరి 16వ తేదీ గురువారం తెల్లవారుజామున 3 :30 గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. చోరీ సమయంలో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో  సైఫ్ అలీఖాన్‌ స్వల్పంగా గాయపడగా.. ఆయనను  లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  దొంగలతో జరిగిన ఘర్షణలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కు మొత్తం 6 కత్తిపోట్లకు గురికాగా..  వాటిలో రెండు లోతైనవి అని తెలుస్తోంది. మరోకటి అతని వెన్నెముకకు దగ్గరగా ఉందని సమాచారం.  

 సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచి పరార్

ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌లు ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి  పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్, ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంఘటన జరిగినప్పుడు సైఫ్ అలీ ఖాన్  తన  కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచారు. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేవడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్ ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు - తైమూర్ (8), జెహ్ (4) ఉన్నారు.  

Also Read :  హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆపేస్తున్నాం..సడెన్‌గా ప్రకటించిన ఆండర్సన్

Advertisment
తాజా కథనాలు