స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లను నమస్కరించి హోంమంత్రి వంగలపూడి అనిత ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే బాలయ్య కూడా ఆమెకు ఆశీస్సులు అందజేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హోంమంత్రితో పాటు మరో మంత్రి సవిత కూడా వెంటనే బాలయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: ఫుట్పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ..
ఇటీవల జరిగిన సార్వతిక ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలయ్య గెలుపొందారు. వరుసగా మూడోసారి బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇటు రాజకీయాలు, అటు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు.
ఇది కూడా చూడండి: TN: గవర్నర్ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్
ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా కూడా లైన్ లో ఉంది. ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉన్నా మరోపక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. అయితే పార్టీ నేతల మీటింగ్ ఏర్పాటు చేయగా.. దాని కోసం బాలకృష్ణ వెళ్లగా మంత్రులు కాళ్లకు నమస్కారం చేశారు.
ఇది కూడా చూడండి: Big Breaking: వాలంటీర్లకు బిగ్ షాక్.. కీలక ప్రకటన!
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు కాళ్లకు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు నమస్కరించారు. దీంతో అతను ఎంత చెబుతున్న తన కాళ్లకు నమస్కారాలు చేస్తున్నారు. ఎవరైనా ఇక తన కాళ్లకు మొక్కితే.. తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చంద్రబాబు స్పష్టం చేశారు
ఇది కూడా చూడండి: మహిళలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ?