🔴Cyclone Montha: మొంథా దెబ్బ... డేంజర్ లో కరీంనగర్, ఆదిలాబాద్.. లైవ్ అప్ డేట్స్!

మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

author-image
By Lok Prakash
New Update
Cyclone Montha

Cyclone Montha

🔴Cyclone Montha Live Updates: 

Montha Toofan: మొంథా తుపాను ఎఫెక్ట్.. జలమయమైన పంట పొలాలు.. ఏపీలో ఈ జిల్లాకు రెడ్ అలర్ట్!

మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారి ఏపీలో బీభత్సం సృష్టించింది. మచిలీపట్నంలో సమీపంలో తుపాను తీరం దాటిన తర్వాత ఏపీలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా భారీ వర్షాలు కురవడంతో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో పాటు 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచడంతో అధికారులు అప్రమత్తం చేశారు. పంట పొలాలు అన్ని కూడా నీటితో నిండిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Montha Cyclone: దిశ మార్చుకున్న మొంథా..తెలంగాణను మొత్తేస్తున్న భారీ వర్షాలు

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఏపీ మొత్తానికి తుపాను ప్రభావం ఉన్నా ఎక్కువగా కోనసీమ, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే వేటకు వెళ్లవద్దని సూచించారు. తుపాను నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మరో మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలు, ఎలక్ట్రిక్ వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. 

  • Oct 30, 2025 13:37 IST

    Montha Cyclone : జలదిగ్బంధంలో తెలంగాణ జిల్లాలు.. చెరువులను తలపిస్తున్న కాలనీలు..కొట్టుకు పోయిన ధాన్యం

    తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    Montha Cyclone Effect On Telangana



  • Oct 30, 2025 13:36 IST

    Montha Toofan

    మొంథా తుపాను నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో శ్రీ వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 



  • Oct 30, 2025 12:21 IST

    ఎన్టీఆర్ జిల్లా.. జగ్గయ్యపేట...

     

    • లింగాల మున్నేరు బ్రిడ్జికు గత రాత్రి నుండి ఇప్పటివరకు 1.50 lac క్యూసెక్స్ వాటరుకు దిగుకు వచ్చాయని
    • మున్నేరు ఉదృతం పెరగటంతో ఇంకా 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అంచనా వేసిన ఇరిగేషన్ అధికారులు



  • Oct 30, 2025 12:21 IST

    ఎన్టీఆర్ జిల్లా.. ఇబ్రహీంపట్నం...

    • ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం,ఫెర్రీ ఘాట్ ల వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని ఆర్డీవో కె చైతన్య మండల తహశీల్దార్ వై వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు.
    • జూపూడి లోని చిన లంక కు వచ్చిన వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించారు...
    • ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు భారీగా వస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
    • ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పరిశీలించాలని ఆర్డీవో కె చైతన్య అధికారులను ఆదేశించారు.



  • Oct 30, 2025 07:44 IST

    బ్రేకింగ్.. బ్రేకింగ్.. బ్రేకింగ్ 

     

    • సంగం పెన్నా బ్యారేజ్ కు తృటి లో తప్పిన ప్రమాదం.
    • వరదకు కొట్టుకు వచ్చిన మూడు బోట్లు.
    • సంగం బ్యారేజి లో ఇరుక్కుంటే... గేట్లు దెబ్బతినే ప్రమాదం.
    • వాటిని తీసేందుకు ప్రయత్నం చేస్తున్న ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు.
    • సంగం బ్యారేజి ను సందర్శించిన కలెక్టర్..హిమాన శుక్లా, యస్ పి అజితా వేజండల .
    • కృష్ణ పట్నం పోర్టు నుంచి ప్రత్యేక బోట్లను తెప్పించి వాటిని తీసే ప్రయత్నం



  • Oct 30, 2025 07:43 IST

    బ్రేకింగ్.. బ్రేకింగ్.. బ్రేకింగ్ 

    సంగం పెన్నానది ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా,జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల సందర్శించారు.వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన బోట్లను వారు పరిశీలించారు.బోట్లు కొట్టుకొచ్చిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.బోట్లను బయటకు తీసే చర్యలపై చర్చించారు.ఒక బోటును స్టార్ట్ చేసి బయటకు తరలించారు. ఆనకట్ట పై ఇరుక్కున్న పెద్ద బోటుతో పాటు ,మరో బోటు ను  బయటికి తీయమని అధికారులకు ఆదేశించారు. .ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెన్నానది వద్దకు చేరుకున్నాయి.ఈ కార్యక్రమం లో ఆర్డీఓ పావని,డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి,తహసీల్దార్ సోమ్లా నాయక్, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ బోట్లను నది నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.



  • Oct 30, 2025 07:43 IST

    ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద

    • విజయవాడ, ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న వరద
    • భారీ వర్షాల తో ఎగువ ప్రాంతాల నుంచి బ్యారేజి కి చేరుతున్న వరద నీరు
    •  రేపు ఉదయానికి బ్యారేజి కి రానున్న  మూడు లక్షల క్యూసెక్కుల నీరు 
    • ప్రస్తుతం ఇన్ ఫ్లో.. 1.10 లక్షల క్యూసెక్కులు
    •  వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు విడుదల చేస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు
    • వర్షాల‌ కారణంగా కాలువలకు నీటిని నిలుపుదల చేసిన అధికారులు
    • వరద పరిస్థితి, బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన సూచనలు చేస్తున్న కలెక్టర్ లక్ష్మీశా



  • Oct 30, 2025 07:42 IST

    ఎన్టీఆర్ జిల్లా  జగ్గయ్యపేట

    • వత్సవాయి మండలం లింగాల  మున్నేరు బ్రిడ్జిపై  వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ , జిల్లా కలెక్టర్ లక్ష్మీశా , విజయవాడ సి పి
    • లింగాల మున్నేరు కు పెరుగుతున్న వరద  నీటి ప్రవాహం
    • ఎగువా ప్రాంతం నుండి వస్తున్న వరద ఉధృతి  ఎక్కువగా ఉండటం ...
    • లింగాల మున్నేరు బ్రిడ్జిపై వరద నీరు పారుతుండటంతో  లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ  పునరావాస  కేంద్రాలకు పంపించామణి ....
    • వరద ముప్పు ప్రాంత ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం  మొత్తం అప్రమత్తంగా పనిచేస్తున్నామని ....
    • పునరావస కేంద్ర0లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా స్కూల్లో వారికి అన్ని వసంతలతో ఏర్పాట్లు చేశామాని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజాగోపాల్ తాతయ్య అన్నారు....



  • Oct 30, 2025 07:42 IST

    ఎన్టీఆర్ జిల్లా నందిగామ 

    • మున్నేరు కు భారీ వరద నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సౌమ్య....
    • లోతట్టు ప్రాంతాల ఇళ్ళకు వెళ్ళి ఇళ్ళు వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచన....
    • తెలంగాణ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సమాచారం అందించారు.....
    • హైవేపై కూడా వదర నీరు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు....
    • హైవేపై వరద నీరు వస్తే నల్గోండ వైపు నుంచి వాహనాలు మళ్ళింపు చేయాలని సూచన.....
    • ఎగువ ప్రాంతాల్లోని వరంగల్ ఖమ్మం జిల్లాలో కుంభవృష్టి నేపథ్యంలో నందిగామ సబ్ డివిజన్ లో హై అలెర్ట్....
    • కీసర వద్ద పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఎమ్మెల్యే సౌమ్య....



  • Oct 30, 2025 07:41 IST

    Montha Toofan: మొంథా తుపాను ఎఫెక్ట్.. జలమయమైన పంట పొలాలు.. ఏపీలో ఈ జిల్లాకు రెడ్ అలర్ట్!

    మొంథా తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను వల్ల ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

    MOntha



  • Oct 30, 2025 07:40 IST

    Montha Cyclone: దిశ మార్చుకున్న మొంథా..తెలంగాణలో భారీ వర్షాలు

    ఏపీతో ఆగిపోతుందనుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రతాపం చూపిస్తోంది. ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు నీట మునిగాయి.

    tg



Advertisment
తాజా కథనాలు