/rtv/media/media_files/2025/08/01/shivalinga-viral-video-2025-08-01-11-34-33.jpg)
Shivalinga Viral Video
Shivalinga Viral Video: రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో కనిపించిన అరుదైన దృశ్యం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా కనిపించే చీమల పుట్టలకు భిన్నంగా, ఇది అచ్చం శివలింగాన్ని తలపించే ఆకారంలో ఉండటంతో ఆ దృశ్యాన్ని చూసినవారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ వింత ఘటనను వీడియోలు తెస్తూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.
శివలింగం ఆకారంలో చీమల పుట్ట..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దబోనాల గ్రామం పరిధిలో ఒక పొలంలో ఈ అరుదైన పుట్ట కనిపించింది. సాధారణంగా చీమలు గుండ్రంగా లేదా ఎలాపడితే ఆలా పుట్టలు నిర్మిస్తాయి. కానీ, ఈ పుట్ట మాత్రం ఒక పీఠంపై నిలబడినట్లుగా, శివలింగం ఆకృతిలో చాలా అందంగా ఉంది. దాదాపు ఒక అడుగు ఎత్తులో ఉన్న ఈ పుట్ట అందరినీ ఆకట్టుకుంటోంది. దీని శిఖర భాగం స్పష్టమైన శివలింగాన్ని పోలి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పుట్టను గమనించిన స్థానికులు, వెంటనే ఈ వార్తను గ్రామంలోని వారందరికీ తెలియజేశారు.
శివలింగం ఆకారంలో చీమల పుట్ట
— ChotaNews App (@ChotaNewsApp) August 1, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో కనిపించిన అరుదైన దృశ్యం.
చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులు.
సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటున్న వైనం. pic.twitter.com/1k9JJh18kJ
ఈ పుట్టను చూసిన స్థానికులు దీన్ని దైవిక మహిమగా భావిస్తున్నారు. శివుడు తమ గ్రామంలోనే ప్రత్యక్షమయ్యాడని నమ్ముతున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ పుట్టను దర్శించుకోవడానికి వస్తున్నారు.
Also Read: తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?
ఈ అరుదైన పుట్టకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా?" అని కొందరు, "ఇది భగవంతుని మహిమ" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. చీమల వంటి చిన్న జీవులు ఇంత చక్కని శివలింగ ఆకృతిని ఎలా నిర్మించాయోనని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
అయితే కొంతమంది ఇంట్లో కూడా చీమలు పుట్ట పెడితే మంచిదని భావిస్తుంటారు. మన పూర్వీకులు ప్రకృతిలో కనిపించే ప్రతి చిన్న జీవిని కూడా విశేషంగా భావించేవారు. జంతువులు, పక్షులు, చీమలు వంటి జీవుల ప్రయాణం, ప్రవర్తన ద్వారా భవిష్యత్తులో జరిగే మార్పులను ఊహించేవారు.
అనేకమంది నమ్మే అభిప్రాయం ఏంటంటే, ఇంట్లో నల్ల చీమలు కనిపించడం వల్ల అదృష్టం, సంపద మీ ఇంటికి చేరుతాయని నమ్ముతారు. ఇవి కేవలం ఊహలు కాదని, చాలా కాలం నుంచి ప్రజలు నమ్ముతున్న విషయాలని పండితులు కూడా చెబుతున్నారు.
Also Read: కుక్క మంచి మనసు.. లేకదూడకు పాలిచ్చిన వీడియో వైరల్
నల్ల చీమలు సాధారణంగా క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి గుణాలకు ప్రసిద్ధి. ఇవి ఎప్పుడూ సమష్టిగా పనిచేస్తూ, అహారాన్ని కూడబెట్టడం, పుట్టను కట్టడం వంటి పనులలో నిమగ్నంగా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభ సూచకం. ముఖ్యంగా చీమలు పుట్ట కట్టడం ప్రారంభిస్తే, దానిని లక్ష్మీదేవి వాసంగా కూడా భావిస్తారు. ఇది ఆ ఇంట్లో ఆర్థికాభివృద్ధి, ధన ప్రాప్తి, ఆనందకరమైన జీవిత సంకేతంగా భావిస్తారు.
కొందరు నమ్మకం ప్రకారం, నల్ల చీమలు ఆహారం తీసుకెళ్లడం చూస్తే, అది ఇంట్లోకి సంపద తీసుకొచ్చే సూచనగా భావిస్తారు. అంతేకాదు, ఇంట్లో శుభమైన మార్పులు జరగబోతున్నాయని కూడా అంటారు.
ఏది ఏమైనప్పటికి, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాలలో దర్శనమిచ్చిన ఈ శివ లింగాకారపు చీమల పుట్ట మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.