Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి

ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు.

New Update
Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి

Series of Accidents :అతివేగం(Over Speed), నిద్రమత్తు, సమయానికి ఎయిర్ బ్యాగ్స్(Air Bags) తెరుచుకోకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం... ఇలా చాలా కారణాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) లాస్య నందిత(Lasya Nanditha) మృతికి దారి తీశాయి. ఈ రోజు తెల్లవారు ఝామున 5.15 కు లాస్య వెళుతున్న కారు ఓఆర్ఆర్‌(ORR) లో ప్రమాదానికి గురైంది. ముందు సీటుకు ఆమె తల బలంగా తాకడంతో... ఇన్నర్ ఇంజ్యురీస్ అయి అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కారులోంచి బయటకు తీసి పటాన్ చెరు అమేథా ఆసుపత్రికి తరలించారు. దీని తరువాత పోస్ట్ మార్టం నిమిత్తం లాస్య మృతదేహాన్ని గాంధీ హాస్పటల్‌కు తరలించనున్నట్టు సమాచారం.

వెంటాడిన వరుస ప్రమాదాలు..

ఎమ్మెల్యే లాస్య నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. అంతకు ముందు రెండు ప్రమాదాల నుంచి ఆమె తప్పించుకున్నారు. కానీ మూడోసారి మాత్రం మృత్యువుకు బలయ్యారు. ఈ ప్రమాదాలు కూడా వరుసగా మూడునెలల్లోనే జరగడం విచారకరం. మొదటిసారి డిసెంబర్ 24న బోయిన్‌పల్లి దగ్గర లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు ఎమ్మెల్యే లాస్య. బోయినపల్లి వీఆర్ ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతుండగా ఎమ్మెల్యే లాస్యతో పాటూ పలువురు లిఫ్ట్‌లో ఉండిపోయారు. చాలాసేపు డోర్ తెరుచుకోకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కాసేపటి తర్వాత ఆసుపత్రి సిబ్బంది లిఫ్ట్ డోర్ పగులకొట్టి లాస్య నందితను, మిగతావారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

రెండోసారి...

దీని తరువాత ఫిబ్రవరి 13న నల్లగొండ దగ్గర లాస్య కారు ప్రమాదానికి గురయ్యింది. నల్లగొండ(Nalgonda) బీఆర్ఎస్ సభకు హాజరయి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ ఆమె హోంగార్డు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా లాస్య వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి.

ఈరోజు మాత్రం...

మూడోసారి మాత్రం ఎమ్మెల్యే లాస్య నందిత తప్పించుకోలేకపోయారు. నిన్న సదాశివ పేట్లో ఓ ప్రైవేటు పార్టీకి హాజరయి వస్తున్న లాస్య కారు ఓఆర్ఆర్‌లో ప్రమాదానికి గురయ్యింది. కారును ఆమె పీఏ ఆకాష్ నడుపుతున్నారు. లాస్య కారు మధ్య సీటులో కూర్చున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె అక్కడిక్కడే మరణించగా...పీఏ ఆకాష్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.

Also Read : Telangana : ఎమ్మెల్యే లాస్యనందిత మృతి..సీఎం రేవంత్, నేతలు దిగ్భ్రాంతి

Advertisment
తాజా కథనాలు