/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-87-jpg.webp)
Guntur Kaaram Mass Song: మాస్ యాక్షన్ తరహాలో రాబోతున్న మహేష్ 'గుంటూరు కారం' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా పోస్టర్ లో మహేష్ బాబు (Mahesh Babu) డిఫెరెంట్ మాస్ లుక్ లో కనిపించడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ముందు వచ్చిన 'సర్కారీ వారి పాట' మహేష్ బాబు అభిమానుల అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు రాబోతున్న 'గుంటూరు కారం' పై ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
Get ready to crank up the volume, Super Fans! 💥🔊
A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺
A @MusicThaman Musical 🎹❤️🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl… pic.twitter.com/RQAta4W2sG
— Guntur Kaaram (@GunturKaaram) December 25, 2023
మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది 2024 జనవరి 12 న థియేటర్స్ లో విడుదల కానుంది. రీసెంట్ గా సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా' సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విడుదలైన 'ఓ మై బేబీ' పాట పై పలు రకాల చర్చలు వినిపించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉంది.
ప్రస్తుతం సినిమాలోని ఆఖరి పాట చిత్రీకరణలో ఉంది. తాజాగా చిత్ర బృందం ఈ మాస్ పాటలో శ్రీలీల, మహేష్ బాబుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసింది. ఈ మాస్ బీట్ మహేష్ బాబు, శ్రీలీల (Sreeleela) అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.'గుంటూరు కారం' చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
Also Read: Vishal: ఆ అమ్మాయితో విశాల్ చెట్టాపట్టాల్.. కెమెరా చూసి పరుగో పరుగు.. వైరల్ వీడియో!