/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-04T131250.791-jpg.webp)
Last Day Of Pre Wedding : మూడు రోజుల పాటూ గుజరాత్(Gujarat) లోని జామ్ నగర్ వెలిగిపోయింది. అత్యంత వైభవంగా నిర్వహించిన అనంత్-రాధికా(Anant-Radhika) ల ప్రీ వెడ్డింగ్ వేడుక(Pre-Wedding Celebrations) లతో కోలామలంగా మారిపోయింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిధులతో కళకళలాడింది. కోట్లు ఖర్చు పెట్టి తమ ముద్దుల కొడుకు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను చేశారు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) దంపతులు. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతతో సంబరాలు మిన్నంటాయి. హాలీవుడ్, బాలీవుడ్ తారలు వేదికలను వెలిగించారు. బిల్ గెట్స్(Bill Gates), మార్క్ జుకర్ బర్గ్(Mark Zuckerberg) వంటి అతిధులు ఫంక్ష్‌కు స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచారు.
హస్తాక్షర్‌తో ముగిసిన వేడుకలు...
మూడు రోజుల వేడుకలను నిన్న తెర పడింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌కు హస్తాక్షర్’(Hastakshar) (సంతకం) తో వాటికి ముగింపు పలికారు అనంత్ -రాధికలు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులు పండితుడి సమక్షంలో సంతకాలు చేశారు. హస్తాక్షర్ వేడుకలో భాగంగా అక్క ఈశా అంబానీ, వదిన శ్లోకామెహతాలు అనంత్ అంబానీని వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అంబానీ కుటుంబమంతా రాధిక కోసం ఎదురు చూస్తుండగా.. ఆమె ‘కభీకుషీ కభీఘమ్’ లోని పాట పాడుతూ ఎంట్రీ ఇచ్చింది. పాటతో పాటూ డాన్స్ కూడా చేసింది రాధిక. ఈ మొత్తం తంతు చాలా ఆనందంగా, వైభవంగా జరుపుకున్నారు ఇరు కుటుంబాలు. కోడలు రాధికాను చూసి ముఖేష్, నీతా అంబానీలు మురిసిపోయారు.
ఆకట్టుకున్న నీతా అంబానీ డాన్స్...
ఇక చివరి రోజు నిన్న నీతా అంబానీ చేసిన నృత్యం అతిధులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విశ్వంభరి స్తుతి పేరిట చేసిన నీతా చేసిన డాన్స్ వేరే లెవల్లో ఉందని అంటున్నారు అతిధులు. కాబోయే భార్యాభర్తలకు అమ్మవారి ఆశీస్సులను కోరుతూ ఈ నాట్యం చేశారు నీతా. అంతేకాదు ఈ నృత్యాన్ని మనవరాళ్లు ఆదియా శక్తి, వేదకు అంకితం చేశారు.
Also Read : CM Revanth Reddy : ప్రధాని అంటే పెద్దన్న.. మోదీ మనసు దోచుకున్న తెలంగాణ సీఎం