టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ (ఎలక్ట్రికల్‌)లో మిగిలివున్న పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ పాసై, ఏపీలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు డిసెంబర్ 19లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.

New Update
టీటీడీ ఉద్యోగాలకు అప్లై చేశారా.. మరో ఐదు రోజులే అవకాశం

TTD AEE Recruitment 2023: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. దేవస్థానం పరిధిలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల టీటీడీ ఉద్యోగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా ఏఈఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 19వ వరకూ అప్లై చేసుకునే అవకాశం కల్పించగా దీనిని మరో ఐదు రోజులే సమయం మిగిలివుంది.

ఈ మేరకు సదరు నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోస్టులు :
టీటీడీ ఏఈఈ(ఎలక్ట్రికల్‌): 04

అర్హత :
బీఈ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌) పాసైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఏపీకి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి:
42 ఏళ్లు మించి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌ ఆభ్యర్థులకు అయిదేళ్లు, పీహెచ్‌ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వేతనం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 ఉంటుంది.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. దరఖాస్తులకు 2023 డిసెంబర్‌ 19 చివరి తేది.

పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్‌ సంప్రదించండి:

https://ttd-recruitment.aptonline.in/

TTD AE Jobs Notification PDF

Advertisment
తాజా కథనాలు