2000 Notes: 2000 నోటు మార్చుకోవడానికి టైమ్ లేదు..రేపే చివరి రోజు!

భారత ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్ల (2000 notes) మార్పు గడువు ముగుస్తుంది. వీటిని మార్చుకోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. శనివారం(Saturday) కూడా వీటిని బ్యాంకులో డిపాజిట్ (Deposite) చేసుకోవచ్చని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్(RBI) ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 30 తర్వాత 2000 రూపాయల నోటును బ్యాంకులు తీసుకోవని స్పష్టం చేసింది.

New Update

ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోని వినియోగదారులు వెంటనే బ్యాంకులో డిపాజిట్‌ చేసకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. కాగా ఆర్‌బీఐ ఈ ఏడాది మే 17న 2000 రూపాయల నోట్ల చలామణి నిలిపివేసినట్లు ప్రకటించింది.

దీంతో నాటి నుంచి వినియోగదారులు 2000 రూపాయల నోట్లను 94 శాతం తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. మరో 6 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు అందకపోవడంతో అవి ఎవరి దగ్గర ఉన్నాయో తెలియడంలేదు.

కాగా పేదల వద్ద ఉన్నా, సంపన్నుల వద్ద ఉన్నా ఈ ఐదురోజుల్లో డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సూచించింది. అక్టోబర్ 1 నుంచి 2000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానంగా మారుతాయని 2000 రూపాయల నోట్లు ఉన్న వారు త్వరగా వాటిని మార్చుకోవాలని హెచ్చరించింది.

ఇదిలా ఉంటే ఈ వారంలో బ్యాంకులకు చాలా సెలవులు ఉన్నాయి. శుక్రవారం, శనివారం మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. మొదటి మూడు రోజులు, ఆ తరువాత రెండు రోజులు మాత్రం 2 వేల నోట్లు మార్చుకోవచ్చు. రూ.20 వేల విలువ ఉన్న నోట్లను ఏ బ్యాంకులో నైనా మార్పిడి చేసుకోవచ్చు.

రూ. 50 వేలు రూపాయలు ఆ పైబడి నోట్లు మార్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న రూ. 2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయి. నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 20 రోజుల్లోనే సుమారు 50 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

మార్కెట్లో ఉన్న ఇంకా 7 శాతం నోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికైనా వారంతా కూడా దగ్గర్లో ఉన్న బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోమని పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు