Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్

పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో లక్ష్య సేన్ 20-22, 14-21 తేడాతో విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్‌కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.

Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్
New Update

Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఇండియా నుంచి భారీ అంచనాలతో ఏడుగురు షట్లర్లు బరిలో నిలవగా.. వారిలో లక్ష్యసేన్ ఒక్కడే పతక రేసులో మిగిలాడు. హ్యాట్రిక్ ఒలింపిక్ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టిన పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరగ్గా... గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెస్తారని అనుకున్న డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ సాత్విక్ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిరాగ్ షెట్టి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్ దాటలేకపోయారు. కానీ, అరంగేట్రం ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సంచలన ఆట తీరుతో ముందుకెళ్తున్న యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ లక్ష్యసేన్ సెమీఫైనల్ చేరి పతక ఆశలు సజీవంగా నిలిపాడు.

కాగా ఆదివారం జరిగిన సెమీస్ మ్యాచ్ లో లక్ష్య సేన్ కు భారీ షాక్ తగిలింది. మొదట్లో దూకుడుగా ఆడిన సేన్.. గేమ్ పాయింట్ దగ్గర తడబడ్డాడు. దీంతో ప్రత్యర్థి అక్సెల్ సేన్ వరుస పాయింట్లు నెగ్గి ఆ సెట్ ను (22 - 20) సొంతం చేసుకున్నారు. రెండో సెట్ లో వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించిన సేన్.. ఆ తర్వాత ఒక్కసారిగా పట్టుకోల్పోయాడు. దీంతో 14 - 21 తేడాతో ఆ సెట్ కూడా కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకున్నాడు. ఈ ఓటమి భారత క్రీడా ప్రేమికుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

#lakshya-sen #olympics-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe