Narsampeta : ఉపాధ్యాయుల వేధింపులు.. దారుణానికి పాల్పడ్డ లేడీ టీచర్!

వరంగల్‌ జిల్లా బుధవారంపేటలో దారుణం చోటుచేసుకుంది. తోటి ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ మహిళా టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీజీటీ టీచర్ గా పనిచేస్తున్న హారిక స్కూల్‌లోనే ఆల్‌ అవుట్‌ లిక్విడ్‌ తాగింది. ఆమెను నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతుంది.

New Update
Narsampeta : ఉపాధ్యాయుల వేధింపులు.. దారుణానికి పాల్పడ్డ లేడీ టీచర్!

Crime : వరంగల్‌(Warangal) జిల్లా ఖానాపురం మండలం బుధవారంపేటలో దారుణం చోటుచేసుకుంది. తోటి ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక ఓ మహిళా టీచర్(Lady Teacher) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీజీటీ టీచర్(TGT Teacher) గా పనిచేస్తున్న హారిక స్కూల్‌(Harika School) లోనే ఆల్‌ అవుట్‌ లిక్విడ్‌(All Out Liquid) తాగింది. దీంతో వెంటనే స్పందించిన స్టాఫ్ ఆమెను నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతుంది.

ఈ మేరకు మొత్తం 20 మంది ఉపాధ్యాయులుండగా తనను కొంతకాలంగా వేధిస్తున్నారని హారిక చెప్పింది. కొంతమంది ఆమె ఫొటోలను అభ్యంతరకరంగా చిత్రీకరించి సోషల్ మీడియా(Social Media) లో ప్రచారం చేశారని, దీంతో మనస్థాపానికి గురైన ఆమె దారుణానికి పాల్పడినట్లు తెలిపింది. దీనిపై పోలుసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత నిందితులను శిక్షిస్తామని, హారికకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisment
తాజా కథనాలు