Lady Don In Hyderabad: హైదరాబాద్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న గేమింగ్ స్థావరంపై మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఖాజాగూడలో లేడీ డాన్ మాధవి గేమింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్తులే టార్గెట్‌గా ఈ గేమింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని పలువురు వ్యాపారస్తులకు వల వేసి గేమింగ్ ఆట ఆడేలా ముగ్గులోకి దింపుతోంది.
ALSO READ: నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు ముక్కలాట నిర్వహిస్తోంది. దీంతో చాలా మంది వ్యాపారస్తులు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఆటకు రూ. వెయ్యి వసూలు చేస్తోంది. గేమింగ్‌తో పాటు ఆటాపాటా చేపడుతోంది. అనంతరం వ్యాపారస్తులను లేడీ డాన్ మత్తులోకి దింపి అందినంత దోచుకొంటోంది. ఎవరైనా తిరగబడితే తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతోంది.
కాగా విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వల పన్ని గేమింగ్ ఆటను చిత్తు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.62 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 11 మొబైల్స్ ఫోన్స్, ఐదు సెట్స్ ప్లేయింగ్ కార్డ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.